NTV Telugu Site icon

S Jaishankar: చాలా ముస్లిం దేశాలు భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నాయి..

S Jaishankar

S Jaishankar

కొన్ని దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం, అనిశ్చితి మధ్య చాలా దేశాలు భారత్‌తో స్నేహం చేయాలని భావిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. తన ఒడిశా పర్యటనలో రెండో రోజు ఆదివారం జరిగిన సమావేశంలో ‘విశ్వ బంధు భారత్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను ఏర్పరచగల భారతదేశ సామర్థ్యం గురించి ప్రస్తావించారు. అమెరికా, యూరప్, రష్యా, ఆఫ్రికన్ దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ మరియు అరబ్ దేశాలతో సహా వివిధ దేశాలతో భారతదేశ సంబంధాల గురించి ఆయన వివరించారు. ఇతర దేశాల్లో యుద్ధాలు కొనసాగుతున్నప్పటికీ, ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ సూత్రాన్ని నొక్కి చెబుతూనే, భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రంగాల్లో అన్ని దేశాలతో సహకరించగలదని స్పష్టం చేశారు.

READ MORE: Kesineni Swetha: మేము మళ్ళీ సీఎం జగన్ను గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారు..

భవిష్యత్తులో అమెరికా మరియు యూరప్‌తో పాటు రష్యా మరియు ఆఫ్రికా దేశాలతో కలిసి పని చేయస్తామని చెప్పారు. అలాగే భారతదేశం ఒకవైపు ఇజ్రాయెల్‌తోనూ, మరోవైపు గల్ఫ్, అరబ్ దేశాలతోనూ స్నేహం చేయగలదన్నారు. తన జాతీయ ప్రయోజనాల కోసం వివిధ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పగల మన దేశాన్ని “ప్రపంచ సోదరుడు” గా పేర్కొన్నారు.గ్లోబల్ కనెక్టివిటీని పెంపొందించే ప్రభుత్వ కార్యక్రమాలను చర్చిస్తూ.. మూడు పైప్‌లైన్ ప్రాజెక్టులు, యూఏఈ ద్వారా యూరప్‌కు అనుసంధానం చేయడం వంటి వాటి గురించి వివరించారు. ఇరాన్ మరియు రష్యా గుండా వెళుతున్న అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్ స్థాపన మరియు వియత్నాన్ని కలిపేందుకు ఉపయోగించబడతాయని తెలిపారు. ఇండో-పసిఫిక్, సౌదీ అరేబియా, ఇరాన్, రష్యా, సింగపూర్, వియత్నాం తదితర దేశాలు భారత్‌తో స్నేహం చేయాలని కోరుకుంటున్నాయని అన్నారు. ఇది పెట్టుబడి, ఉపాధి మరియు కనెక్టివిటీని పెంచడంలో సహాయపడుతుందని చెప్పుకొచ్చారు.