Manu Bhaker: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ లలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, ఆమె తృటిలో హ్యాట్రిక్ పతకాలను కోల్పోయింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత మను భాకర్ 3 నెలల విరామం తీసుకోబోతోంది. విరామ సమయంలో ఆమె తన అభిరుచులను కొనసాగించనుంది.
Rishab Shetty : ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మాడు.. ఇప్పుడు జాతీయ అవార్డ్ అందుకున్నాడు
తాజాగా ఓ ప్రముఖ మీడియాతో ఆమె మాట్లాడుతూ.., “ఇప్పుడు నాకు విరామం లభించింది. నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయగలను. ఇంతకు ముందు నాకు అంత సమయం లేదు. కానీ., ఇప్పుడు నా హాబీలకు సమయం దొరుకుతుంది. నాకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. నేను స్కేటింగ్, భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ సమయంలో మను కోచ్ గ్రేట్ షూటర్ జస్పాల్ రానాతో కలిసి ఉంది. మను భాకర్ తన హాలిడే బకెట్ జాబితాను వెల్లడించినప్పుడు, గుర్రపు స్వారీకి నో అంటూ నవ్వుతూ చెప్పాడు జస్పాల్ రానా. స్కేటింగ్, గుర్రపు స్వారీకి వెళ్లకూడదని ఏదైనా జరిగితే ఆమె బాధ్యత వహిస్తుందని రానా అన్నారు. స్కై డైవింగ్, స్కూబా డైవింగ్ కూడా చేయాలని ఉందని కూడా మను తెలిపింది.
Bank Manager Fraud: 26 కిలోల బంగారంతో ఉడాయించిన బ్యాంకు మేనేజర్..