Site icon NTV Telugu

Manik Rao Thakre : భట్టి విక్రమార్క పాదయాత్ర చివరి రోజే పొంగులేటి జాయినింగ్

Manikrao Thakare

Manikrao Thakare

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ రావ్‌ థాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి భేటీ అయ్యారు. జులై 2న ఖమ్మంలో పీపుల్స్‌ మార్చ్‌ ముగింపు సభ ఏర్పాట్లపై చర్చించారు. రాహుల్‌ గాంధీ ఆదేశాలతో భట్టితో పార్టీ ఇన్‌ఛార్జ్‌ భేటీ అయ్యారు. ఖమ్మం సభ విధి విధానాలపై చర్చించిన అనంతరం మాణిక్‌ రావ్‌ థాక్రే మీడియాతో మాట్లాడుతూ.. 36 నియోజకవ్గలలో 1221 కిలో మీటర్లు కాంగ్రెస్ తరుపున భట్టి పాదయాత్ర చేశారన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చివరి రోజే పొంగులేటి జాయినింగ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పొంగులేటి భట్టికి స్వాగతం చెప్తారని, రాహుల్ ఆధ్వర్యంలో భట్టికి వేదికపై ఘన సన్మానం ఉంటుందని ఆయన వెల్లడించారు.

Also Rea : Harish Rao : శస్త్రచికిత్సల కోసం 12 అత్యాధునిక ఫాకో యంత్రాలు

భట్టికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తరుపున నేను ధన్యవాదాలు చెప్తున్నానని ఆయన అన్నారు. జన గర్జన పేరుతో భట్టి ముగింపు సభ చేపట్టనున్నట్లు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా సభా నిర్ణయాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ఎండగడతామని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల రహస్య బంధం గురించి ప్రజలకు చెప్తామన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐలతో విపక్షాలను కేంద్రం వేధిస్తుందని మాణిక్‌ రావ్‌ థాక్రే ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారని, ప్రజలకు భరోసా ఇస్తామన్నారు. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Also Read : AP Govt : రాబోయే ఎన్నికలలో ఉద్యోగ వర్గాల వలన ఎలాంటి ఇబ్బంది లేదు.

Exit mobile version