Site icon NTV Telugu

Manik Rao Thakre : పోలీసులు దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు

Third Day Manik Rao Thackeray

Third Day Manik Rao Thackeray

హత్ సే హాత్ జోడో పేరిట తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం రాత్రి భూపాలపల్లిలో నిర్వహిస్తున్న రేవంత్‌ రెడ్డి పాదయాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లతో, టమాటాలతో దాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లు దువ్వారు. దీనితో యాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక రేవంత్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. ఇలాంటి దాడులు దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ నేతలు దాడులను నమ్ముకొని ఉన్నారన్నారు. కాంగ్రెస్ యువ నాయకున్ని చంపాలని చూసారని ఆయన మండిపడ్డారు.

Also Read : Icon Star: ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ అరుదైన రికార్డ్!

చనిపోయాడని అనుకొని వెళ్ళిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అసలు దోషులెవరో అందరికీ తెలుసు అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వం ఎవరు ప్రశ్నించొద్దని అనుకుంటోందని, తమ తప్పులను, అక్రమాలను ప్రశ్నించొద్దని దాడులకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దాడులను తీవ్రంగా ఖండిస్తోందన్నారు థాక్రే. పేదప్రజలకు న్యాయం అందాలని, రాష్ట్రం అభివృద్ది చెందాలని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, కానీ ఇంతటి దుర్మార్గ పాలన నడుస్తుందని అనుకోలేదన్నారు. బీఆర్ఎస్ చర్యలను ప్రజలు గమనించాలన్నారు. అన్యాయాలు, అత్యాచారాలు తెలంగాణలో పెరిగిపోయాయని, యువత ఆందోళన వదలండి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Also Read : Election Results: ఈశాన్య భారతంలో రెపరెపలాడిన కాషాయ జెండా.. మరోసారి సత్తాచాటిన బీజేపీ

Exit mobile version