Ponniyin Selvan I Box Office Collections: మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం(MANIRATNAM) లేటెస్ట్ మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 (PS 1). చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, పార్తిబన్ లాంటి యాక్టర్స్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. తమిళ నేటివిటీ ఉండడంతో తెలుగు ఆడియన్స్ తో పాటు ఇతర ఇండస్ట్రీ ఆడియన్స్ కూడా పొన్నియిన్ సెల్వన్ సినిమాని చూడడానికి పెద్దగా ఇంటరెస్ట్ చూపించలేదు. దీంతో పొన్నియిన్ సెల్వన్ సినిమా తమిళ ప్రేక్షకులకి మాత్రమే పరమితం అయ్యింది. ఆర్టిస్టుల గెటప్స్ నుంచి వేసిన సెట్స్ అండ్ కథ వరకూ అన్నింట్లో తమిళ నేటివిటీ పుష్కలంగా ఉండడంతో PS 1 సినిమా, తమిళ ప్రేక్షకులు ఉన్న ప్రతి చోట మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.
Read Also: Janasena New Plan: జనసేన కొత్త ప్లాన్.. ఇక, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు..
సెప్టెంబర్ 30న విడుదలైన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 నేటితో యాబై రోజుల థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది (50 DAYS FOR PS 1). బెంచ్ మార్క్ డేస్ ని టచ్ చేసిన రోజే పొన్నియిన్ సెల్వన్ సినిమా 500 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని కూడా చేరుకోవడం విశేషం (PONNIYIN SELVAN 1 GROSSED 500 CRORE). ఇంత వసూళ్లు చేసినా పొన్నియిన్ సెల్వన్ సినిమాని పాన్ ఇండియా హిట్ లిస్టులో వేయడం కష్టమనే చెప్పాలి. అందుకంటే ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ లో మేజర్ పార్ట్ వచ్చింది ఒక్క స్టేట్ నుంచే. మిగిలిన చోట్ల చాలా వరకూ పొన్నియిన్ సెల్వన్ సినిమా పెద్దగా సంచలనాలు నమోదు చేయలేకపోయింది. కోలీవుడ్ నుంచి టాప్ గ్రాసర్స్ లిస్టులో సెకండ్ ప్లేస్ లో ఉన్న పొన్నియిన్ సెల్వన్ సినిమా, కేవలం తమిళనాడులోనే 200 కోట్లకి పైగా షేర్ ని రాబట్టింది. ఇటివలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ, స్మాల్ స్క్రీన్ లో కూడా లార్జ్ స్కేల్ ఆడియన్స్ ని మెప్పించలేకపోతోంది. ఈ కామెంట్స్ ని మణిరత్నం అండ్ టీం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 (PONNIYIN SELVAN 2) సినిమాతో చెరిపేస్తారేమో చూడాలి.