NTV Telugu Site icon

Manchu Manoj: కుటుంబ ఆస్తుల కోసం ఎప్పుడూ ఆశ పడలేదు.. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మనోజ్

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తుతెలియని వారు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచుమనోజ్‌ పహాడీషరీఫ్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు. కాబట్టి పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ను మోహన్ బాబు కోరారు. తాజాగా మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు.

Read Also: Mohan Babu : మనోజ్, మౌనిక వల్ల ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి!

తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనోజ్‌ కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానన్నారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరమన్నారు. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబానికి దూరంగానే ఉంటున్నామని మనోజ్ తెలిపారు. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారన్నారు. ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజీ కెమెరాలు మాయమైపోయాయన్నారు. తన అన్న విష్ణు దుబాయ్‌కి ఎందుకు వెళ్ళాడు అందరికీ తెలుసన్నారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని అన్నారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని విజయ్‌ రెడ్డి ,కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదని.. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు.
నేను, నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని మంచు మనోజ్‌ తెలిపారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని.. విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ వెల్లడించారు.

Show comments