Aadiparvam : మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపర్వం. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్ వర్క్ హైలైట్ గా ఉంటుందని మేకర్స్ తెలుపుతున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి మంచు లక్ష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మీ కనిపించనుంది. మోకాలి వరకు చీరను కట్టి.. నుదుటన పెద్ద బొట్టు పెట్టి పవర్ ఫుల్ ఉమెన్ గా కనిపించింది. ఇక ఈ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడుతూ ..”అమ్మోరు, అరుంధతి చిత్రాల మాదిరిగా హై టెన్షన్ యాక్షన్ సినిమాగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలో కూడా విడుదలకు సిద్ధం అవుతుందని, ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ చిత్రం లాగే ఈ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని నాగలాపురం నాగమ్మ గా మంచులక్ష్మి నటవిశ్వరూపం చూడవచ్చని దర్శకుడు సంజీవ్ మేగోటి చెప్పుకొచ్చాడు.
Read Also:Priya Bhavani Shankar : ఆ సినిమా హిట్ తో ప్రశాంతంగా నిద్రపోయాను..
ఇది ఇలా ఉంటే.. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా ఆదిపర్వం సినిమా రూపొందిస్తున్నారు. “ఆదిపర్వం” సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో “ఆదిపర్వం” సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా “ఆదిపర్వం” థియేటర్స్ లో అనుభూతిని అందిస్తారని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
Read Also:T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియా ఔట్! ఫైనల్‌కు దక్షిణాఫ్రికా