మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్’ మూవీతో థియేటర్లలో మామూలు రచ్చ చేయలేదు. ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్తో వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు రీజనల్ సినిమా రికార్డులన్నీ తిరగరాసి ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. పాత రికార్డులను తుడిచేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ మేనరిజమ్స్, యాక్షన్, ఎమోషన్స్ చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి అసలైన ‘మెగా బ్లాక్‌బస్టర్’ అంటే ఇదే అని అందరితో అనిపించుకున్నారు మన శంకర వరప్రసాద్ గారు. అయితే
Also Read : That One Penguin: సోషల్ మీడియాను కదిలిస్తున్న.. పూరి చెప్పిన ‘ఒక్క పెంగ్విన్’ కథ..
ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ రేపు ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌ను ప్లాన్ చేసింది. జనవరి 25వ తేదీ (రేపు) సాయంత్రం 5 గంటల నుండి ఈ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి. మెగాస్టార్‌ను నేరుగా చూసేందుకు, ఈ విజయాన్ని ఆయనతో కలిసి పంచుకోవడానికి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇండస్ట్రీ మొత్తం ఈ మెగా ఈవెంట్ వైపే చూస్తోంది. రేపు సాయంత్రం మెగా మానియాతో స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోవడం గ్యారెంటీ!