సంక్రాంతి రేసులో ప్రజంట్ తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రీమియర్ షోలకు ముందే ఈ చిత్ర క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి అంటే
Also Read : Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..
సినిమా క్లైమాక్స్‌లో నయనతార ఆమె కుటుంబ సభ్యులను విలన్లు టార్గెట్ చేసినప్పుడు, వారిని కాపాడే క్రమంలో చిరంజీవికి తోడుగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఈ ఇద్దరు టాప్ హీరోలు కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా సాహు గారపాటి సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదభరితంగా సాగుతుందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు.
పండగ వాతావరణానికి తగ్గట్టుగా కామెడీ, ఎమోషన్స్ మెగా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ముఖ్యంగా చిరంజీవి తన పాత సినిమాల తరహాలో ఫుల్ ఎనర్జీతో చేసిన అల్లరి ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు సృష్టిస్తున్న ఈ ‘శంకరవరప్రసాద్’, రేపు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తాడో అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.