Maharashtra: మంత్రికి అవమానం.. పసుపు చల్లిన వ్యక్తి.. కారణమదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Throws Haldi On Minister in Maharashtra: నిరసనలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెలియజేస్తూ ఉంటారు. నాయకులు మాట్లాడేటప్పుడు వారిపై చెప్పులు విసరడం, రాళ్లు వేయడం, వాటర్ బాటిల్స్ విసరడం లాంటివి మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే అలాగే పసుపు చల్లి నిరసన తెలిపాడు ఓ వ్యక్తి. ఏకంగా మంత్రి పక్కనే నిలబడి ఆయనపై పసుపు చల్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Viral Video: మట్టిపాత్రలో వంట చేయాలనుకున్న యువతి.. స్టవ్ మీద పెట్టగానే ఏం జరిగిందంటే
Also Read
ఇందులో ధంగర్ వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ ను కలిశారు. అయితే ఆయన వినతి పత్రాన్ని తెరచి దానిలో ఉన్నది చదువుతూ ఉన్నారు. అంతలో ఊహించని ఘటన జరిగింది. వారిద్దరిలో ఒకరైనా శేఖర్ భంగలే అనే జేబులో నుంచి పసుపు తీసి మంత్రి పై చల్లాడు. దీంతో మంత్రితో సహా అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మంత్రి సిబ్బంది ఆ యువకుడిని పక్కకు నెట్టేశారు. అంతేకాకుండా అతనిపై పిడిగుద్దులు కురిపించారు మంత్రి అనుచరులు. సోలాపూర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ విశ్రాంతి భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ వ్యక్తిని వదిపెట్టాలని ఏం చేయవద్దని మంత్రి తన అనుచరులను ఆదేశించారు. పసుపు చల్లడాన్ని తాను అవమానకరంగా భావించడం లేదని పసుపు ఎంతో పవిత్రమైనదని మంగళకరమైనదని మంత్రి అన్నారు.
ఇక ఇలా పసుపు చల్లడంపై ఆ వ్యక్తి మాట్లాడుతూ ఇలా చేసినందుకు తానేమీ బాధపడటం లేదన్నాడు. తమ వర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే తాను అలా చేశానని తెలిపారు. తమ వర్గం వారు చాలా వెనుకబడి ఉన్నారని వారిని ఎస్టీ కేటగిరిలో చేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద నల్ల రంగు చల్లుతానని హెచ్చరించాడు. ప్రస్తుతం మంత్రి మీద పసుపు చల్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
पवित्र भंडारा अंगावर उधळला तर मारहाण करावी लागते का..?? हेच का भाजपा चे हिदुत्व..?? pic.twitter.com/x9RgAkOq7x
— Shilpa Bodkhe – प्रा.शिल्पा बोडखे (@BodkheShilpa) September 8, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!