Leg Lengthening Surgery: సాధారణంగా యుక్త వయసుకు వచ్చేసరికి అందరిలో పొడవు పెరగడం అనే ప్రక్రయ ఆగిపోతుంది. అనంతరం పొడవు పెరగాలనుకున్నా అయ్యే పని కాదు. కానీ అమెరికాకు చెందిన ఓ 68 ఏళ్ల వృద్ధుడికి ఇది సాధ్యపడింది. 68 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు కాలి పెద్ద ఎముక ఆపరేషన్‌తో మూడు నెలల్లో 3 అంగుళాల పొడవు పెరిగిపోయాడు. ఆ వ్యక్తి మూడు అంగుళాల పొడవును పెంచే శస్త్రచికిత్స కోసం 130,000 పౌండ్లు (రూ. 1.2 కోట్లు) వెచ్చించాడు.
అమరికాలో నివసించే రాయ్ కాన్ అనే 68 ఏళ్ల వృద్ధుడు లెగ్ లెంతెనింగ్ సర్జరీ అనగా కాలు పొడవుగా పెరిగే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడెందుకు ఈ ఆపరేషన్ చేయించుకోవాలని అనిపించింది? అని అడిగితే ఆయన వెరైటీ సమాధానం చెప్పారు.”పొట్టిగా ఉండటం అనేది పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ నాకు జీవితాంతం ఆ ఫీలింగ్ ఉండేది. అయితే ఈ ఆపరేషన్‌కి తగిన డబ్బు, వయసులో ఉన్నప్పుడు నా దగ్గర ఉండేది కాదు. ఇప్పటికి నేను దాన్ని ఖర్చు చేయగలిగాను. దాదాపు నాకు 70 ఏళ్లు దగ్గర పడుతున్నాయి. ఈ వయసులో ఈ ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ముందు నా భార్య చాలా కంగారు పడింది. చివరికి ఆమెను ఒప్పించి ఆపరేషన్ చేయించుకున్నాను” అని రాయ్‌కాన్ సమాధానం చెప్పాడు.
Special Story on Marriages: రోజులు 31. పెళ్లిళ్లు 32 లక్షలు. ఖర్చు 3.75 లక్షల కోట్లు
లెగ్ లెంతెనింగ్ సర్జరీ అంటే.. కాళ్లలోని ఎముకను కత్తిరించి కాస్త పొడవు పెంచే ప్రక్రియ. 1950ల నుంచి అందుబాటులో ఉన్న ఈ శస్త్రచికిత్స విధానంతో రాయ్ కాన్ చివరికి కాలి ఎముకల పొడవును విజయవంతంగా పొడుగు చేయించుకున్నారు. మూడు అంగుళాల పొడవు పెరిగారు. అంతకు ముందు 5 అడుగుల 6 అంగుళాల పొడవు ఉండే రాయ్‌కాన్.. ఆపరేషన్ తర్వాత ఆయన ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలకు చేరుకుంది. ఈ సర్జరీకి రాయ్ ఏకంగా రూ. 1.2 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేశారు. శస్త్రచికిత్స ప్రక్రియకు పెద్ద సమయమేమీ పట్టలేదని.. కానీ రికవరీ అయ్యేందుకు నెలలు పట్టిందని రాయ్ కాన్ వెల్లడించారు.
శస్త్రచికిత్స చేసిన డాక్టర్ దేబిపర్షద్ మాట్లాడుతూ.. ” ఈ సర్జరీ ప్రక్రియను పూర్తి చేయడానికి దాదాపు రోజూ గంటన్నర సమయం పట్టవచ్చు. ఎముకను ఒక రోజులో ఒక మిల్లీమీటర్ పొడిగించాల్సి ఉంటుంది. ఇలా ఒక అంగుళం పొడవు పెరగడానికి దాదాపు 25 రోజులు పడుతుంది. అలా కాళ్లు మూడు అంగుళాల పొడవు రావడానికి సుమారు రెండున్నర నెలల సమయం పట్టింది. రోగి 3, 4, 5, లేదా 6 అంగుళాలు పెరగాలనుకుంటున్నారా అనేదానిపై ఆధారపడి, ఈ ప్రక్రియకు $70,000 డాలర్ల నుంచి 150,000 డాలర్ల మధ్య ఖర్చు అవుతుంది.” అని డాక్టర్ చెప్పారు.