Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఆదివారం నాడు 45 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం గొడవపడి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో నరికి చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుందని వారు తెలిపారు.
Read Also: Samajavaragamana: బీకామ్ లో ఫిజిక్స్.. ఈ డీలిటెడ్ సీన్ ఉంటే థియేటర్ మారుమ్రోగిపోయేదంతే
అసలేం జరిగిందంటే.. దిలీప్ పవార్ అనే వ్యక్తి భార్య, నలుగురు పిల్లలతో బాద్‌నగర్‌లోని ఇంట్లో నివాసం ఉంటున్నాడు. దిలీప్ పవార్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం సేవించి అతడు నిద్రిస్తుండగా.. తెల్లవారుజామున 1 గంటలకు తన పెంపుడు కుక్క అతన వద్దకు వచ్చి మొరిగింది. ఆగ్రహంతో లేచిన అతను ఇంట్లోంచి కత్తి తీసుకుని కుక్కను చంపేందుకు పరుగెత్తాడు. ఈ సమయంలో అతని భార్య గంగ దిలీప్‌ను అడ్డుకుంది. పెంపుడు జంతువును చంపకుండా వదిలేయాలని అతనితో గొడవపడింది. దీనితో కోపోద్రికుడైన దిలీప్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. తన కుమార్తె నేహాపై, కొడుకు యోగేంద్రపై కత్తితో దాడి చేశాడు. దీని కారణంగా పిల్లలిద్దరూ కూడా మరణించారు. ఈ సమయంలో ఇంట్లో మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు తమ ప్రాణాలను రక్షించుకుని పారిపోయారు. దీంతో దిలీప్ కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: DRDO Drone Crash: పరీక్షిస్తుండగా పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్
ప్రాణాలను కాపాడుకుని పారిపోయిన చిన్నారులు చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. ప్రజల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలు పడి ఉన్నాయి. ప్రాథమిక విచారణలో దిలీప్ పవార్ విపరీతంగా మద్యం సేవించేవాడని అధికారి తెలిపారు. భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చిన అతడు మద్యం మత్తులో ఉన్నాడని ఇప్పుడే నమ్మకంగా చెప్పలేమని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. నిందితుడికి కొన్ని నెలల నుంచి ఉద్యోగం లేదు. అతనికి సరుకు రవాణా వాహనం ఉంది. దానితో అతను జీవనోపాధి పొందుతున్నాడ., అయితే అతను దానిని కొంతకాలం క్రితం విక్రయించినట్లు విచారణలో తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుందని పోలీసులు తెలిపారు.
