Man locked inside a Store: అప్పుడప్పుడు మనం చేసే పనుల వల్ల మనమే ఇరుక్కుంటూ ఉంటాం. బయటకు వెళ్లినపుడు అలెర్ట్ గా లేకపోతే కొన్ని సార్లు చిక్కుల్లో పడుతూ ఉంటాం. అలాంటి అనుభవమే ఎదురయ్యింది ఓ వ్యక్తికి. షాపింగ్ కోసం ఓ వ్యక్తి పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ కు వెళ్లాడు. అయితే అక్కడ అతనికి ఒక మసాజ్ చైర్ కనిపించింది. దానిని చూడగానే అందరిలాగానే అతను కూడా అందులో కూర్చోని సేదతీరాలి అనుకున్నాడు. అంతే దానిలో కూర్చొని నిద్రపోయాడు. అయితే కొద్ది సేపటికి మెలుకువ వచ్చి చూసేసరికి షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ సమయానికి లైట్ లు అన్నీ ఆపేసి స్టోర్ కు తాళం వేశారు. దీంతో అతని చుట్టూ చీకటిగా ఉంది. ఏంచేయాలో తోచని అతను వెంటనే ఎక్స్ (ట్విటర్) లో తన పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేసి సాయం కోరాడు.
Also Read: Milk: ఆరోగ్యానికి మంచిదని పాలు ఎక్కవగా తాగుతున్నారా? వెంటనే ఆపేయండి.
చీకటితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ లోపల ఉండిపోయాను అని రాసుకొచ్చాడు.ఇక అతను షేర్ చేసిన ఫోటోలో కేఎస్ అనే స్టోర్ తలుపులు మూసేసి ఉండటం చూడవచ్చు. ఈ ట్వీట్ ద్వారానే ఆ వ్యక్తి షాపులో చిక్కుకున్న విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో పోలీసులకు సమాచారం అందింది. వారు షాపు యజమానిని అప్రమత్తం చేశారు.దీంతో 10 మంది పోలీసులు వచ్చి అతడికి సాయం చేశారు. అతను దొంగ కాదని నిర్ధారించుకున్న తరువాత అతడిని షాపు నుంచి విడిపించారు. దీంతో ఆ వ్యక్తి ఊపిరిపీల్చుకున్నాడు. అయితే అతడిని చూసుకోకుండా తాళం వేసి అంత సేపు అసౌకర్యానికి గురిచేసినందుకు షాపు యాజమాన్యం అతనికి క్షమాపణలు చెప్పింది. మొత్తానికి ఈ విషయం వైరల్ కావడంతో అలా ఎలా నిద్రపోయావ్ భయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అబ్బా అలా ఇరుక్కోవడం నా కల అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అలా ఇరుకున్నప్పుడు ఎలా బయటపడాలో అనే గేమ్ ఆడుకోవాలి అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.
え…… pic.twitter.com/AalynpL1PB
— こばたつ (@afdc1257) August 15, 2016