Langar House : భార్యను 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించాడు.. పక్కింటి వాళ్లతో మాట్లాడిందని చంపేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Langar House : భార్యభర్తల బంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఎన్ని మనస్పర్థలు వచ్చినా ఆ నమ్మకం ఇద్దరి బంధాన్ని నిలబెట్టుతుంది. కానీ అనుమానంతో కూడిన బంధం చాలా కాలం నిలవదు. అలాంటి ఘటనే హైదరాబాద్ పరిధిలోని లంగర్ హౌజ్ లో చోటు చేసుకుంది. అతడికి భార్యపై అనుమానం ఉంది. దీంతో ఆమెను ఎవరితో మాట్లాడినివ్వకపోయేవాడు. 20ఏళ్లుగా ఆమెను ఇంట్లోనే బంధిస్తున్నాడు. చిత్ర హింసలు పెడుతున్నాడు. 20 ఏళ్లలో అనేక సార్లు ఇళ్లు మార్చాడు. చివరికి లంగర్ హౌస్ లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే అక్కడ తన భార్య పక్కింటి వారితో మాట్లాడిందన్న కారణంగా దారుణంగా హతమార్చాడు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన జహంగీర్.. పంజగుట్ట కు చెందిన కనీజ్ బేగానికి 2004లో వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి నిదర్శనంగా నలుగురు పిల్లలు పుట్టారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. జహంగీర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతడు వివాహమైన కొంత కాలం నుంచే భార్యపై అనుమానం మొదలుపెట్టాడు. ఆమెను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. చివరికి ఆమెను తన తల్లితో కూడా మాట్లాడినివ్వకపోయేవాడు. పని మీద బయటకు వెళ్లినప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసేవాడు. ఈ క్రమంలో అనేక సార్లు వారి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇంటి ఓనర్లు అతడిని హెచ్చరించడంతో ఇళ్లు మారిపోయేవాడు. 10 ఏళ్ల కిందట పెద్ద గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు ఇద్దరినీ కూర్చోబెట్టి, జహంగీర్ ను తిట్టి… కనీజ్ ను మళ్లీ కాపురానికి పంపించారు.
Read Also:Imran Khan: నన్ను పదేళ్లపాటు జైల్లో ఉంచాలని పాక్ సైన్యం ప్లాన్ చేస్తోంది..
ఇటీవలే జహంగీర్ లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీకి ఫ్యామిలీని షిప్ట్ చేశాడు. ఐదు రోజుల కిందట ఎప్పటిలాగే పనికి వెళ్లి తిరిగి వచ్చాడు. చిన్న కూతురిని పిలిచి తల్లి ఈ రోజు ఎవరితో మాట్లాడిందని అడిగాడు. పక్కింటి వాళ్లతో అని బిడ్డ బదులు ఇచ్చింది. దీంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కనీజ్ ను తీవ్రంగా కొట్టాడు. మనస్థాపం చెందిన ఆమె.. పిల్లలను తీసుకొని తన సోదరుడు ఉంటున్న ఎండీలైన్స్ లోని ఇంటికి వెళ్లింది. కాగా, శనివారం సాయంత్రం బావ మరిది ఇంటికి గఫార్ వెళ్లాడు. ఇప్పటి నుంచి కలిసి మెలిసి ఉందామని నచ్చజెప్పాడు. అనంతరం పిల్లలను తన బావ మరిది ఇంట్లోనే ఉంచి, భార్యను మాత్రమే బాగ్దాద్ కాలనీలో ఉన్న ఇంటికి వచ్చారు. అయితే రాత్రి భోజనం అయిన తరువాత భార్యతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను హత్య చేశాడు. తరువాత లంగర్‌హౌస్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు పంపి… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!