మానవుడు కాలంతో పరిగెడుతూ.. కొత్త కొత్త టెక్నాలజీలను కనుపెడుతుంటుంటే.. కొన్ని గ్రామాలు ఇంకా మూఢనమ్మకాలు అనే అంధకారంలోనే ఉన్నాయి. అయితే.. ఇలాంటి సంఘటనే ఇప్పుడు తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి పెద్దమనుషులను ఆశ్రయించగా వారు ఆ ఇద్దరినీ పంచాయతీ పిలిపించారు. అక్కడ నాకు ఆమె ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా.. నీకు సంబంధం లేకుండా శీలపరీక్షకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. చివరికీ శీలపరీక్షలో నెగ్గినా.. వారు తప్పుచేశావంటూ బుకాయిస్తూ నిందించారు దీంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు తెలుసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..
వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి సమీపంలోని బంజర్ పల్లి గ్రామానికి చెందిన జగన్నాథం గంగాధర్ అనే వ్యక్తి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆ మహిళ భర్త గంగాధర్ పై పెద్ద మనుషులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. దీంతో.. పెద్ద మనుషులు ఇరువురిని పిలిపించి సముదాయించే ప్రయత్నం చేశారు. ఇలా అప్పటికే రెండు మూడు సార్లు వారి మధ్యలో పంచాయతీ జరిగింది. సదరు మహిళతో నాకు ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ మొరపెట్టుకున్నా పెద్ద మనుషులు ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాకుండా.. అతనికి వారి ఆచారంలో శీల పరీక్ష పెట్టారు. తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే గంగాధర్ మంటల్లో కాలుతున్న గడ్డపారను చేతితో తీయాలని ఆ పెద్ద మనుషులు పంచాయతీ చెప్పారు.
Also Read : Increments in India: భారతీయ సంస్థల్లో ఈ ఏడాది వేతనాల పెంపు పరిస్థితిపై సర్వే
ఈ అగ్నిపరీక్షకు లక్నవరం సరస్సు వేదికగా ఫిబ్రవరి 25వ తారీకున చోటుచేసుకుంది. అయితే.. పెద్ద మనుషులు చెప్పినట్లే.. గంగాధర్ సరస్సులో స్నానం చేసి అగ్నిగుండం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నిప్పుల్లో ఉన్న గడ్డపారను తీశాడు. అయితే.. ఈ పరీక్షలో గంగాధర్ చేతికి గాయాలైతే తప్పు చేసినట్లు, లేకుంటే తప్పు చేయనట్లు వారి ఆచారంలో నమ్ముతారు. ఈ పరీక్షలో నెగ్గినవారికి ఓడిన వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. గంగాధర్ చేతికి గాయాలు కాలేదని.. తాను తప్పుచేయలేదని తనకు డబ్బులు ఇప్పించాలని కోరారు. అయితే.. సంతృప్తి చెందని పంచాయతీ పెద్దలు గంగాధర్‌కు గాయాలయ్యాయని.. తప్పు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో గంగాధర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.