NTV Telugu Site icon

Road Accident: ఏపీలో అన్న ప్రేమ కోసం తమ్ముడి బలి..

Road Accident

Road Accident

Road Accident: అన్న ప్రేమ కోసం వెళ్లి తమ్ముడు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపింది.. అన్న ప్రేమిస్తే.. తమ్ముడు ఎందుకు మృతిచెందాడు.. అది ఎలా జరిగింది.. యువతి కుటుంబ సభ్యులు వెంటాడి చంపేశారా? లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా? అయినా.. ఈ ప్రమాదంలో ప్రియుడో.. ప్రియురాలో కాకుండా.. ప్రియుడి తమ్ముడు ఎలా బలి అయ్యాడనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో 400 మంది పోకిరీలు అరెస్టు

చిత్తూరు జిల్లా ఐరాలకు చెందిన యువకుడు నిరంజన్‌కు రాజమండ్రికి చెందిన ఓ యువతికి ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచియం ఏర్పడింది.. ఎఫ్‌బీ నుంచి వీరి ప్రేమ వాట్సాప్‌ వరకు వెళ్లింది.. ప్రేమ ఊసులు చెప్పుకున్నారు.. పెళ్లి చేసుకోవాలలనే నిర్ణయానికి వచ్చారు.. అయితే, కుటుంబ సభ్యులు తనకు వేరే యువకుడితో పెళ్లి నిర్ణయించారని ప్రియుడు నిరంజన్ కు తెలిపింది ప్రియురాలు.. ఈ సమయంలో తను రాజమండ్రికి వచ్చేందుకు వీలు కాదని చెప్పి.. తన తమ్ముడు దేవేంద్రను రాజమండ్రికి పంపించాడు నిరంజన్‌.. ఇక, దేవేంద్రతో రాజమండ్రి నుంచి స్కూటీపై ఐరాలకు బయల్దేరింది ఆ యువతి.. కానీ, దేవేంద్రను మృత్యువు వెంటాడింది.. నెల్లూరు జిల్లా కోవూరుపల్లి దగ్గరకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ ఢీకొట్టింది దేవేంద్ర నడుపుతోన్న వాహనం.. ఈ ప్రమాదంలో దేవేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. లక్ష్మికి గాయాలయ్యాయి.. పోలీసులు ఇచ్చిన సమచారంతో కోవూరుపల్లి వచ్చారు దేవేంద్ర కుటుంబ సభ్యులు.. ఇక, నిరంజన్ కుటుంబ సభ్యులతో కలిసి ఐరాలకు వెళ్లిపోయింది లక్ష్మి.. ఈ ఘటనపై లక్ష్మి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు.. ఇక్కడ ప్రేమ జంట కలిసినా.. అన్న ప్రేమ కోసం వెళ్లిన తమ్ముడు మాత్రం బలైపోయాడు.

Show comments