NTV Telugu Site icon

Crime News: అవుకు బస్టాండ్‌లో దారుణం.. భార్య, అత్తపై కత్తితో దాడి

Crime

Crime

Crime News: నంద్యాల జిల్లా అవుకు బస్టాండ్‌లో దారుణం జరిగింది. భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగాడు. భార్యపై అనుమానంతో రంగస్వామి అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం వల్లే అతడు కత్తితో నరికినట్లు తెలిసింది.

Read Also: Hit and Run case: హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్.. ఆర్మీ ఉద్యోగి మృతి..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అవుకు కోట వీధిలో కుమారి (30), భర్త రంగస్వామి నివాసముంటున్నారు. వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అనుమానం, కుటుంబ సమస్యలతో తరచూ ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంటోంది. ఈ క్రమంలోనే అవుకు బస్టాండ్‌లో కత్తితో వీరంగం సృష్టించాడు నిందితుడు రంగస్వామి.భార్య కుమారి, అత్త సుబ్బలక్ష్మమ్మ (50 )కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు. భార్య కుమారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడు రంగస్వామిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.