Murder Attempt: అదనపు కట్నం.. మహిళలకు శాపంగా మారుతోంది. కొంత మంది భర్తలు.. సంపాదించకుండా..జులాయిగా తిరుగుతూ డబ్బు కోసం చివరికి భార్యలనే దారుణంగా వేధిస్తున్నారు. అదనపు కట్నం తీసుకు రావాలని చిత్రహింసలు పెడుతున్నారు. ఒక్కోసారి హత్య చేసేందుకు వెనకాడడం లేదు. తాజాగా హైదరాబాద్ నాగోల్‌లో ఓ శాడిస్ట్ మొగుడు.. అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నం చేశాడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వేణుగోపాల్. ఇతనికి ఏడాది క్రితం మహాలక్ష్మితో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.…
నంద్యాల జిల్లా అవుకు బస్టాండ్‌లో దారుణం జరిగింది. భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగాడు. భార్యపై అనుమానంతో రంగస్వామి అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం వల్లే అతడు కత్తితో నరికినట్లు తెలిసింది.