నంద్యాల జిల్లా అవుకు బస్టాండ్‌లో దారుణం జరిగింది. భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగాడు. భార్యపై అనుమానంతో రంగస్వామి అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం వల్లే అతడు కత్తితో నరికినట్లు తెలిసింది.
నంద్యాల జిల్లా అవుకులో దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.. చల్లా కుటుంబంలో ఎప్పటి నుంచో ఈ విభేదాలు కొనసాగుతూ రాగా.. ఈ సారి, ఘర్షణ, పరస్పరం దాడి వరకు వెళ్లింది వ్యవహారం.. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా చెబుతున్నారు.
కరువు ప్రాంతాలుగా ముద్ర వేసుకున్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని వసతి కల్పించి దుర్భిక్షంలో ఉన్న ప్రాంతాలను సుభిక్షం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సంకల్పించుకున్నారు.