Site icon NTV Telugu

Crime News: అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులు.. యువకుడు అరెస్ట్

Crime News

Crime News

Crime News: మైనర్ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి మార్చి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా మైనర్ అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్న అజయ్ కుమార్‌ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఘట్‌కేసర్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు తెలిపారు.

Read Also: CM Revanth Reddy: లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలి.. డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు

మైనర్ అమ్మాయిల ఫోటోలు న్యూడ్‌గా మార్చి వేధింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. తాను చెప్పినట్టు వినకపోతే… ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని అమ్మాయిలను బెదిరించాడని చెప్పారు. జనగాం జిల్లా కొడకండ్లకి చెందిన అజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఓ బాలిక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వెలుగులోకి వచ్చింది.

Exit mobile version