మైనర్ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి మార్చి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా మైనర్ అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్న అజయ్ కుమార్‌ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఘట్‌కేసర్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు తెలిపారు.