పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. పూర్నియా పోలీస్ సూపరింటెండెంట్ కార్తికేయ శర్మ హాట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తికేయ శర్మ పెద్ద సంచలన విషయాన్ని బయటపెట్టారు. గతంలో పప్పూ యాదవ్‌ను ఓ అపరిచిత వ్యక్తి బెదిరించగా.. ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన మహేష్ పాండే అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడికి ఏ గ్యాంగ్‌తోనూ సంబంధాలు లేనట్లు తెలుస్తోంది. కానీ, గతంలో కొందరు ప్రభావిత వ్యక్తులతో సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది. అయితే నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఉపయోగించిన మొబైల్, సిమ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. మహేశ్ పాండేను ఢిల్లీ నుంచి అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
READ MORE: Delhi: ఢిల్లీలో దారుణం.. లైంగిక దాడిని ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడు హత్య
అసలు ఏం జరిగింది?
బీహార్‌లోని పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు. పప్పూ యాదవ్ కు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ పేరుతో బెదిరింపులు వచ్చాయి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చెందిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సల్మాన్‌ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు చేసినా.. పట్టించుకోకుంటే చంపేస్తామని, ఎప్పటికప్పుడు కదలికలను నిశితంగా గమనిస్తున్నామని పప్పూయాదవ్‌కు బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గంటకు రూ.లక్ష చెల్లించి జైల్ సిగ్నల్ జామర్లను నిలిపివేస్తున్నాడని, ఆ తర్వాత యాదవ్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పేర్కొన్నట్లు సమాచారం.
READ MORE:TB Disease: ప్రమాదకరంగా మారుతున్న ఈ అంటు వ్యాధి.. ప్రతి ఏడాది లక్షల్లో మృత్యువాత