ఒక మంచి ఉద్యోగం కోసం ఆశగా అప్లై చేసుకొని ఇంటర్వ్యూ అయిన తరువాత యు ఆర్ సెలెక్టడ్ అని మొయిల్ వచ్చే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదా. అయితే ఆ కంపెనీ నుంచే మొయిల్ వచ్చి కానీ దానిలో మీరు అప్లై చేసుకున్న జాబ్ కు కాకుండా చాలా తక్కువ జాబ్ కు సెలక్ట్ అయినట్లు వస్తే అప్పటి వరకు పడిన ఆనందం ఆవిరైపోతుంది కదా. సరిగ్గా అలాగే జరిగింది ఓ యువకుడికి. అతడు ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. క్షణాల్లోనే ఆ వార్త వైరల్ గా మారి కంపెనీ హెడ్స్ ను కూడా చేరింది.
Also Read: UPI Payments With Out Internet: నెట్ లేకుండానే ఫోన్ పే, గూగుల్ పే చేసేయండిలా
విషయానికి వస్తే యష్ ఆచార్య అనే యువకుడు ఎక్స్ ( ట్విటర్) లో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జెప్టో (Zepto)లో ప్రొడక్ట్ డిజైనర్ పోస్టు ఖాళీ ఉందని తెలియడంతో దాని కోసం యష్ ఆచార్య దరఖాస్తు చేశాడు. కొంత సమయం తరువాత అతనికి జెప్టో నుంచి మెయిల్ వచ్చింది. అది చూసి ఒక్కసారిగా యష్ షాకయ్యాడు. అతను అప్లై చేసుకుంది ప్రొడక్ట్ డిజైనర్ పోస్ట్ కోసం అయితే ముంబై లోని డెలివరీ బాయ్ కు సరిపోతారు అంటూ మొయిల్ వచ్చింది. అయితే ఇదే విషయాన్ని సోషల్ మీడయా వేదికగా పేర్కొంటూ తాను ప్రొడక్ట్ డిజైనర్ పోస్టుకు అప్లై చేశాను అంటూ ఆచార్య క్యాప్షన్ లో రాసుకువచ్చాడు.
Zepto నుంచి వచ్చిన ఇమెయిల్‌లో, “Zeptoలో ఈ డెలివరీ బాయ్ (ముంబై) పోస్టుకు మీరు బాగా సరిపోతారు” అని ఉంది అని తెలిపాడు. అయితే ఇది పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే చాలా మందిని చేరింది. వారిలో Zepto వ్యవస్థాపకుడు మరియు CTO, కైవల్య వోహ్రా కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా యష్ పంచుకున్నారు ఈ పోస్ట్ వైరల్ అయిన అనంతరం వోహ్రా యష్ ను ‘లింక్డ్‌ఇన్’లో సంప్రదించి అతని CVని అడిగినట్లు తెలిపాడు. కైవల్య వోహ్రా నుంచి వచ్చిన మెసేజ్ ల వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌ను యష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఈసారి నీకు జాబ్ పక్కా బ్రో కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Par maine to product designer ke liye apply kiya tha🙄 pic.twitter.com/R1yBJHd8LB
— yash (@yashachaarya) August 16, 2023