UPI Payments With Out Internet: నెట్ లేకుండానే ఫోన్ పే, గూగుల్ పే చేసేయండిలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Payments With Out Internet: ఇప్పుడు కరెన్సీ నోట్లను వాడే వారు చాలా తక్కువ అయిపోయారు. ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం అంటూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్ వినియోగం భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా భీమ్ యాప్ ను కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక కరోనా తరువాత ఈ డిజిటల్ పేమెంట్స్ మరింత పెరిగాయి. చిన్న చిన్న షాపుల నుంచి బడా షాపుల వరకు ఎక్కడ చూసిన పేమెంట్స్ కోసం యూపీఐ క్యూఆర్ కోడ్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు. చిన్న ఛాయ్ తాగినా కూడా ప్రతి ఒక్కరు ఫోన్ పేనో, గూగుల్ పేనో చేస్తున్నారు. అయితే యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు కొన్ని సార్లు నెట్ వర్క్ సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు నెట్ పనిచేయక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇకపై ఈ పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ సహా దేశంలోని 13 ప్రముఖ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ సేవ యూజర్లకు అందుబాటులో ఉంది.
Also Read: Wife Nude Videos: ఛీ వీడసలు మనిషేనా.. అప్పు తీర్చలేక భార్యతో ఆ పని చేయించిన భర్త
Also Read
- Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
- 53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
- Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
- Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
దీని కోసం మీ బ్యాంక్ అకౌంట్ కు ఏ నెంబర్ అయితే ఉందో అంటే యూపీఐ పేమెంట్స్ చేసే మొబైల్ నంబర్ నుంచి *99# నంబర్‌కు డయల్ చేయాలి.తర్వాత 1 నొక్కాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి. తదుపరి నగదు పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నంబర్/UPI ID/ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి.ఎంత డబ్బు పంపాలో ఎంటర్ చేసి.. తర్వాత UPI పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం మన బ్యాంక్ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ కనిపిస్తుంది.ఏ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరగాలలో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ డెబిట్ కార్డు ఎక్స్పైరీ డేట్‌తో పాటు కార్డు నంబర్లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయాలి. ఇలా చేస్తే మీకు కావాల్సిన నంబర్ కు డబ్బులు పంచుకోవచ్చు. ఈ ఆప్షన్‌తో ఒకసారి రూ. 5 వేల వరకు చెల్లించొచ్చు. దీని కోసం సర్వీస్ ఛార్జీలు చెల్లించాలి. ప్రతి సారి 50 పైసలు ఛార్జీ విధిస్తారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..