NTV Telugu Site icon

Mamata Banerjee: ఏకపక్ష చర్చలు సరికాదు.. ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ

Mamatha

Mamatha

ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య చర్చలకు తనను ఆహ్వానించనందుకు ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపకంపై చర్చలపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోల్‌కతా-ఢాకా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని సీఎం మమతా బెనర్జీ హైలైట్ చేస్తూ.. “సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష చర్చలు ఆమోదయోగ్యం కాదు” అని ఆమె పేర్కొన్నారు. గంగా న‌ది, తీస్తా న‌ది జ‌లాల షేరింగ్ అంశంపై ఇటీవ‌ల ప్రధాని షేక్ హ‌సీనా, మోదీ మ‌ధ్య చ‌ర్చలు జ‌రిగాయి.

CM Chandrababu: రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్‌.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ

పీఎం మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య ఇటీవల జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో.. తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ.. 1996 గంగా జల ఒప్పందాన్ని పునరుద్ధరించడంపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ’పై చర్చించేందుకు సాంకేతిక బృందం త్వరలో బంగ్లాదేశ్‌ను సందర్శిస్తుందని చెప్పారు. అయితే.. ఫరక్కా బ్యారేజీ కోత, పూడిక, వరదలకు కారణమైందని టీఎంసీ ఆరోపిస్తుంది. కాగా.. నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా సర్కార్ చాలా కాలంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో.. ఈ భేటీపై మమతా బెనర్జీ మండిపడ్డారు.

Robert vadra: వయనాడ్‌లో ప్రియాంక పోటీపై రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!

ఇటువంటి ఒప్పందాల ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని మమతా బెనర్జీ లేఖలో ప్రస్తావించారు. భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌ధ్య ఉన్న ఫ‌ర‌క్కా ఒప్పందాన్ని రెన్యువ‌ల్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్ర స‌ర్కారు ఉన్నట్లు తెలుస్తోంద‌న్నారు. దాని వల్ల ప‌శ్చిమ బెంగాల్‌పై ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆమె త‌న లేఖ‌లో తెలిపారు.