Site icon NTV Telugu

Mamata Banerjee: బీజేపీపై కన్నెర్ర చేసిన దీదీ.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు

Mamatha

Mamatha

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమితో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పన్స్కురాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దీదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వస్తే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే భారత కూటమికి పూర్తిగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: Loksabaha Elections 2024: ఓటు వేయని 3 గ్రామాల ప్రజలు.. కారణమేంటంటే..?

ఈ క్రమంలోనే.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై టీఎంసీ అధినేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధపూరితమైన హామీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన చేసే హామీల్లో నిజం లేదని ఆమె ఆరోపించారు. ఇక కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఉచితంగా ఎల్‌పీజీ, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు.

Read Also: Terrorists: అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంక వాసులుగా గుర్తింపు..

ఇది ఢిల్లీ ఓటు అని.. ఇక్కడ గెలిస్తే భారత్ కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని మమతా బెనర్జీ తెలిపారు. ఈ సందర్భంగా టీఎంసీకి ఓటు వేయాలని ఆమె ఓటర్లను కోరారు. మరోవైపు.. సందేశ్‌ఖాలీ మహిళల విషయంలో బీజేపీ కుట్ర పన్నిందని సీఎం మమత మరోసారి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో బీజేపీ కుట్రలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తోందని సీఎం మమత ఆరోపించారు. ఈ సందర్భంగా కుల, మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Exit mobile version