Mamata Banerjee: “అప్పటి వరకు నేను చావను”.. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- కోల్‌కతాలో మమతా బెనర్జీ భారీ ధర్నా నిర్వహించారు.
- అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై దాడులపై ఆగ్రహం.
- ‘‘మమ్మల్ని గద్దె దించే వరకు నేను చావను’’ అంటూ బీజేపీకి హెచ్చరిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: మేనల్లుడు, డైమండ్ హర్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీ, మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి ఘటనలపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ హెచ్చరికలు చేశారు. ‘‘ మమ్మల్ని గద్దె దించే వరకు నేను చావను’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఆమె బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘మేము పోరాడుతాము లేదా చస్తాము’’ అని అన్నారు.
గతం తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అధ్యక్షుడు సాయం కోరుతూ తనకు ఫోన్ చేశారని కానీ, ఈ విషయం మీడియాతో ఎప్పుడూ చెప్పలేదని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ తప్పా మిగతా పార్టీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ సాయం అడిగినప్పుడల్లా తాను సాయం చేశానని, వారి కష్టకాలంలో అండగా నిలిచానని వెల్లడించారు. ‘‘నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. నేను బతికి ఉన్నంత కాలం ధైర్యంగా పోరాడుతాను’’ అని అన్నారు.
Also Read
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
- Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్‌లో తీవ్ర సంక్షోభం..
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
కోల్‌కతాలోని వై ఛానెల్లో మమతా బెనర్జీ ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ.. మనకు నమ్మక ద్రోహం చేసిన వారిని ఈశ్వర్ అల్లా, దేవుడి పేరు మీద బుద్ధి ప్రసాదించాలని అన్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి గురించి మాట్లాడుతూ.. ఆ రోజు అతను చనిపోయే వాడని అన్నారు. సీఎం సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ.. ప్రభుత్వం బీజేపీలో పాతతరం వారికి అధికారం లేదని, కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి అధికారం ఉందని అన్నారు.
తాజావార్తలు
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
-
Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
-
PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
-
Mamata Banerjee: “అప్పటి వరకు నేను చావను”.. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Nani: నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!