TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
- TGPSC నుంచి మూడు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల
- R&B శాఖలో 271 AEE పోస్టుల భర్తీకి అవకాశం
- కాలుష్య నియంత్రణ మండలిలో 19 ఇంజనీర్ ఖాళీలు
- జూన్ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఏకంగా మూడు వేర్వేరు నోటిఫికేషన్లను కమిషన్ విడుదల చేసింది.
విడుదలైన ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్న పోస్టులలో రోడ్లు & భవనాల (R&B) శాఖలోనే అత్యధిక ఖాళీలు ఉన్నాయి. ఈ శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (సివిల్) పోస్టులను మొదటి నోటిఫికేషన్ ద్వారా, అలాగే 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) పోస్టులను రెండో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటితో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) లో ఉన్న 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం మూడో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఈ ఏడాది జులై 1నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో చట్టబద్ధమైన సడలింపులు వర్తిస్తాయి.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను వేర్వేరు తేదీల్లో ప్రారంభించనున్నారు. R&B శాఖలోని సివిల్ పోస్టులకు జూన్ 06 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమై, జూలై 13 వరకు గడువు ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ పోస్టులకు జూన్ 08 నుండి దరఖాస్తుల స్వీకరణ మొదలై, జూలై 15తో ముగుస్తుంది. ఇక కాలుష్య నియంత్రణ మండలిలోని అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 10నుండి ఆన్లైన్ లింక్ అందుబాటులోకి రానుంది, దీనికి జూలై 17వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా TGPSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కావలసిన పూర్తి స్థాయి విద్యార్హతలు, సిలబస్, పరీక్షా విధానం, ఇతర సమగ్ర సమాచారం కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన డిటైల్డ్ నోటిఫికేషన్లను పరిశీలించాల్సిందిగా అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!