NTV Telugu Site icon

Mamata Banerjee: బెంగాల్ వరదల వెనుక ‘కుట్ర’.. కేంద్రమే కారణం!

Mamata Banerjee

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో వరదలకు బాధ్యత వహించాలని అన్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డివిసి) డ్యామ్‌లను డ్రెడ్జింగ్ చేయడంలో కేంద్రం విఫలమైందని బెంగాల్ సీఎం ఆరోపించారు. దాని ఫలితంగా రాష్ట్రంలోని అనేక జిల్లాలు వరదలకు దారితీసిందన్నారు. మానవ నిర్మిత వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డివిసి) కారణమని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి వెనుక కుట్ర ఉందని అన్నారు. డీవీసీ ఆనకట్టలు జార్ఖండ్-బెంగాల్ సరిహద్దులోని మైథాన్, పంచేట్ వద్ద ఉన్నాయి.

READ MORE: Kolkata: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు బెంగాల్ సర్కార్ బిగ్ షాక్.. మెడికల్ రిజిస్ట్రేషన్‌ రద్దు

కాగా.. గురువారం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పష్కురాలో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఆమె, కార్పొరేషన్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటానని హెచ్చరించారు. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. మమతా బెనర్జీ మాట్లాడుతూ .. “ఇది వర్షం వల్ల సంభవించిన వరద కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ డీవీసీ తన డ్యామ్‌ల నుంచి విడుదల చేసే నీరు. ఇది మానవ నిర్మిత వరద. కేంద్ర ప్రభుత్వం ఎందుకు డ్యామ్‌లను శుభ్రం చేయడం లేదు. నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎక్కడ తగ్గించారు. ఇందులో పెద్ద కుట్ర ఉంది. మేము దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ప్రారంభిస్తాం.” అని తెలిపారు. వరద బాధిత ప్రజలందరికీ తగిన సహాయ సామగ్రిని అందేలా చూసేందుకు చూస్తానన్నారు.

READ MORE: Jani Master: జానీ మాస్టర్ అరెస్ట్ .. పోలీసుల అధికారిక ప్రకటన

బెంగాల్-జార్ఖండ్ సరిహద్దులను 3 రోజుల పాటు బంద్..

బెంగాల్ జార్ఖండ్ సరిహద్దును 3 రోజుల పాటు మూసివేస్తామని మమతా బెనర్జీ తెలిపారు. డివిసితో అన్ని సంబంధాలను తెంచుకుంటానని కూడా మమత హెచ్చరించారు. “జార్ఖండ్ సరిహద్దు సమీపంలోని రోడ్లు మునిగిపోవడం ప్రారంభించాయి.. అందువల్ల జార్ఖండ్ నుంచి వచ్చే వాహనాలు వరద నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల, నేను జార్ఖండ్ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను.” అని ఆమె వ్యాఖ్యానించారు.

Show comments