NTV Telugu Site icon

Mallu Ravi : కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు

Mallu Ravi On B

Mallu Ravi On B

కేసీఆర్ కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మల్లు రవి. రేవంత్‌ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి మాట్లాడుతూ.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారన్నారు. నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కేసీఆర్ ఎక్కడి నుండి ఇస్తారని అనలేదా అని ఆయన అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రైవేటు సంస్ధలతో కుమ్మక్కై ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందన్నారు.

Also Read : Himanshu : గొప్ప మనసు చాటుకున్న కేసీఆర్‌ మనవడు.. రూ. కోటితో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసిన హిమన్షు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో రైతు డిక్లరేషన్ లో చెప్పామని, అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు… ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారని, తెలంగాణ రాష్ట్ర డిమాండ్స్ ను కేంద్రం దృష్టికి ఏనాడైన తీసుకువెళ్లారా అని ఆయన అన్నారు.

Also Read : Kishan Reddy : దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో ఉంది

రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలపై రాజకీయంగా లబ్ది పొందాలని బీఆర్ఎస్ చూస్తోందని, పేరుకు 24 గంటల ఉచిత విద్యుత్ అంటున్నారు కానీ అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు మల్లు రవి. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండు సార్లు అధికారం ఇచ్చారు… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ను ఓడించడం ఖాయమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే పోలీసు రాజ్యం వస్తుందని, డిస్కంలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

Show comments