రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి సీనియర్ ఖండిస్తున్నట్లు తెలిపారు. మోడీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలను సైతం ఈడీ, సీబీఐ పేరుతో అణిచివేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 60 ఏళ్ల స్వతంత్ర ఫలాలను దేశ ప్రజలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని పేర్కొన్నారు. మరోవైపు.. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని రాహుల్ గాంధీ న్యాయ యాత్రపై బీజేపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Assam : రూ. 68.41 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు..
కాంగ్రెస్ పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే హిందుత్వం ఉందని మల్లు రవి తెలిపారు. హిందుత్వం పేరుతో బీజేపీ పార్టీ.. భారతదేశాన్ని విడదీయాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఓట్ల కోసం బీజేపీ పార్టీ మాత రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో.. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సంక్షమం అభివృద్ధి కోసమే పనిచేసింది.. అందుకే ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. ప్రజలు కేటీఆర్ పవర్ పీకేసినా పవర్ లో ఉన్నట్టు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు.. రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Uttam Kumar Reddy: రెండేళ్లలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి..