Mallikarjun Kharge: ఏఐసీసీ చీఫ్ ఖర్గే హెలికాప్టర్ లో తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Serious: ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారులు తమను లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎన్నికల అధికారులు తమ పార్టీ నేతలను టార్గెట్ చేశారని వ్యాఖ్యనించింది. అయితే, ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ నేతలు మాత్రం ఈజీగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడింది. బీహార్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజేశ్ రాథోడ్ ఈ మేరకు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే శనివారం బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్, ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణించిన హెలికాఫ్టర్‌లో ఎన్నికల అధికారులు, పోలీసులు చెక్ చేశారు.
Read Also: Mr Bachchan : మిస్టర్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
అయితే, ఖర్గే హెలికాఫ్టర్ లో తనిఖీలకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజేశ్ రాథోడ్ పోస్ట్ చేశారు. అలాగే, ఈ వీడియోను బీహార్‌లోని ఎన్నికల సంఘం సీఈవోకు సైతం షేర్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నేతల హెలికాఫ్టర్లను మాత్రమే ఇలా తనిఖీలు చేస్తారా? లేకుంటే ఎన్డీయేలోని అగ్రనేతల హెలికాఫ్టర్లను కూడా ఇదే తరహాలో సోదాలు నిర్వహిస్తారా? అనేది వెల్లడించాలని బీహార్‌లోని ఎన్నికల ప్రధాన అధికారిని రాజేశ్ రాథోడ్ కోరారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల నేతలను తనిఖీ చేసిన వీడియోలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుంటే ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుందనే అవకాశాలున్నాయని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను సైతం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!