కోలీవుడ్‌లో ‘తంగలాన్’, మలయాళంలో ‘హృదయ పూర్వం’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న మాళవిక మోహనన్, తాజాగా ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, మాళవిక అందం నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. ‘ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన పర్సనాలిటీ చాలా ప్రత్యేకం. ఆయన స్టార్‌డమ్‌ను అంత దగ్గరగా చూడటం ఒక అద్భుతమైన అనుభవం’ అని తన సంతోషాన్ని పంచుకుంది. అంతేకాకుండా, తన కెరీర్ ప్లానింగ్ గురించి చెబుతూ..
Also Read : Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..
తాను కేవలం ఒకే భాషకు పరిమితం కానని స్పష్టం చేసింది.. ‘నాకు చాలా భాషలు మాట్లాడటం వచ్చు, అది నా కెరీర్‌కు ప్లస్ అయ్యింది. మలయాళంలో మంచి కథలున్న సినిమాలు చేస్తూనే, కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అని తన రూట్ మ్యాప్ వివరించింది. ప్రస్తుతం ఉన్న ఓటీటీలు, సోషల్ మీడియా వల్ల భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందరికీ చేరుతున్నాయని, నటులకు ఇది నిజంగా ‘గోల్డెన్ పీరియడ్’ అని మాళవిక అభిప్రాయపడింది. రాజా సాబ్ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో మరిన్ని క్రేజీ ఆఫర్లు రావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.