Hari Hara Veera Mallu: సిద్ధంగా ఉండండి.. రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ!
- సినిమా విడుదల ఆలస్యం అంటూ సోషల్ మీడియాలో వార్తలు
- రిలీజ్‌పై మరోసారి స్పష్టతనిచ్చిన మేకర్స్
- మెరుపు వేగంతో పనులు దూసుకుపోతున్నాయంటూ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో రిలీజ్ కానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల అవుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే హరిహర వీరమల్లు విడుదల ఆలస్యం కానున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
మే 9న హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. ‘రీ రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెరుపు వేగంతో పనులు దూసుకుపోతున్నాయి. ఈ వేసవికి అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందిస్తాము. మే 9న హరిహర వీరమల్లు బిగ్ స్క్రీన్‌లలో విడుదల అవుతుంది. మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభూతికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి’ అని మేకర్స్ ట్వీట్ చేశారు. పవన్‌కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. ఈ పోస్టుతో నెట్టింట రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Also Read: Anchor Ravi: నేను క్షమాపణ చెప్పను.. టీవీ షో వివాదంపై యాంకర్ రవి! ఆడియో వైరల్
హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించారు. అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ముందుగా మార్చి 28న విడుదల చేయాలని భావించినా.. మే 9కు వాయిదా వేశారు.
Re-recording, Dubbing, and VFX are in full swing—pushing boundaries at lightning speed.⚡🔥
We’re gearing up to bring you the biggest cinematic spectacle of the summer!#HariHaraVeeraMallu hits the big screens on May 9th, 2025. ⚔️💥
Get ready for an epic experience like never… pic.twitter.com/R4I8I7C57P
— L.VENUGOPAL🌞 (@venupro) April 11, 2025
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!