MakeMyTrip: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌ని సందర్శించడం, ఆ తర్వాత మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు ప్రధానిని ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా భారతీయలు, మాల్దీవులపై విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ‘‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’’ ట్రెండ్ అవుతోంది. ఆ దేశానికి టూర్ కోసం వెళ్తామనుకున్న ఇండియన్స్ అక్కడ హోటల్స్, వెళ్లేందుకు నిర్ణయించుకున్న ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే భారతీయులు నెట్టింట లక్షద్వీప్ అందాల కోసం వెతుకుతున్నారు. తాజాగా ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ MakeMyTripలో వినియోగదారులు లక్షద్వీప్ కోసం సెర్చ్ చేశారు. ఏకంగా లక్షద్వీప్ కోసం సెర్చ్ చేయడం 3400 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు మాల్దీవ్స్ బుకింగ్స్ నిలిపేయాలని ఇండియన్స్ డిమాండ్ చేసినట్లు వెల్లడించింది.
Read Also: Abhinandan Vardhaman: అభినందన్ కోసం పాక్ వైపు 9 క్షిపణులను గురిపెట్టిన భారత్..
‘‘భారతీయ బీచ్‌లపై ఉన్న ఈ ఆసక్తి దేశంలోని అద్భుతమైన సముద్ర తీరాలను అణ్వేషించడానికి భారతీయ ప్రయాణికులను ప్రోత్సహించేందుకు ఆఫర్స్, డిస్కౌంట్స్‌లతో ‘బీచ్ ఆఫ్ ఇండియా’ ప్రచారాన్ని ప్రారంభించేందుకు మాకు ప్రేరణ ఇచ్చిందని మేక్ మై ట్రిప్ ఎక్స్‌లో పేర్కొంది. ఒక గంటలోనే ఈ పోస్టుకు 3000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయని, అలాగే మాల్దీవ్స్ ని డెస్టినేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎక్కువ మంది వినియోగదారులు కామెంట్స్ చేశారు.
మాల్దీవులకు విమానాల టికెట్లను రద్దు చేయాలని, ఇదే మీకు ఉన్న ఏకైక ఛాయిస్ అని, లేకపోతే ఈజీమై ట్రిప్‌కి మారుతామని ఓ నెటిజెన్ హెచ్చరించారు. ఇలా పలువురు నెటిజన్లు మాల్దీవ్స్ ప్యాకేజీలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సోమవారం EaseMyTrip సహ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ పిట్టి మాట్లాడుతూ, మాల్దీవులకు బుకింగ్‌లు “నిరవధికంగా” నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
NewsFlash: We have observed a 3400% increase in on-platform searches for Lakshadweep ever since Honorable PM’s visit.
This interest in Indian beaches has inspired us to launch a 'Beaches of India' campaign on the platform with offers and discounts to encourage Indian travellers… pic.twitter.com/4CYb1iApZG
— MakeMyTrip (@makemytrip) January 8, 2024