Site icon NTV Telugu

J-K: పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..

Jammu And Kashmir

Jammu And Kashmir

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన రెండు నెలల తర్వాత.. సైన్యం ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసింది. పూంచ్, రాజౌరి జిల్లాల సరిహద్దులోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో చొరబాటుకు ప్రయత్నిస్తుండగా పాక్ జాతీయుడిని అరెస్టు చేసింది. అయితే.. ఈ వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అధికారులు సోమవారం సమాచారం ఇచ్చారు. వారి సమాచారం ప్రకారం.. మొహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి జైష్-ఎ-మొహమ్మద్ (JEM) కు చెందిన నలుగురు ఉగ్రవాదుల బృందంతో భారత సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నాడు.

READ MORE: Kubera : పదేళ్లకే అన్నీ తెలుస్తున్నాయ్.. శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్

ఆదివారం మధ్యాహ్నం ఆ వ్యక్తిని ఆర్మీ సిబ్బంది పట్టుకున్నారు. అతనితో పాటు వచ్చిన ఉగ్రవాదులు కొండపై నుంచి దూకి పాకిస్థాన్ సరిహద్దుకు చేరుకున్నారు. పట్టుబడిన ఆరిఫ్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని దాటోట్ గ్రామ నివాసి అని పోలీసులు తెలిపారు. ఆరిఫ్ నుంచి ఒక మొబైల్ ఫోన్, సుమారు 20,000 పాకిస్థాన్ రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, తాను పీవోకే నివాసినని, ఆ ప్రాంతం గురించి తనకు మంచి భౌగోళిక పరిజ్ఞానం ఉందని చెప్పాడు. పాకిస్థాన్ సైన్యం సూచనల మేరకు.. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు సహాయం చేస్తున్నానని వివరించాడు. ఉగ్రవాదిని ఇంకా ప్రశ్నిస్తున్నామని.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు యత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

READ MORE: Nothing Phone 3 Launch: ‘నథింగ్‌ ఫోన్‌ 3’ వచ్చేస్తోంది.. ఫీచర్స్, ప్రైస్‌ డీటెయిల్స్ ఇవే!

పహల్గాం ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే.. ఇప్పుడు చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులు భారత్‌లో అదే తరహా దాడికి యత్నించేందుకు ప్లాన్ చేసి ఉండవచ్చని సమాచారం.! వారి ప్లాన్ ఏదైనా ఎట్టకేలకు భద్రతా దళాలు భగ్నం చేశారు. పట్టుబడిన ఆరిఫ్ నుంచి కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Exit mobile version