Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahmudullah: 2016 టీ20 వరల్డ్‌కప్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ ను గుర్తు చేసుకుంటూ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మహ్మదుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్ లో ఓటమి తర్వాత తమ జట్టు ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్ లో కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 2016లో భారత్–బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది.
AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..
Also Read
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
చివర్లో బంగ్లాదేశ్ విజయం సాధించేందుకు 6 బంతుల్లో 11 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్ ను భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వేయగా.. రెండు, మూడో బంతులను ముష్ఫికూర్ రహీమ్ వరుస బౌండరీలకు తరలించాడు. అయితే ఆ తర్వాత పాండ్యా అద్భుతంగా తిరిగి మ్యాచ్ లోకి వచ్చాడు. వరుస బంతుల్లో రహీమ్, మహ్మదుల్లా వికెట్లు తీసి మ్యాచ్ ను మళ్లీ భారత్ వైపు తిప్పాడు. చివరి బంతికి బంగ్లాదేశ్‌కు కేవలం రెండు పరుగులు అవసరం కాగా.. శువగత బంతిని సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు.
అప్పుడు భారత కెప్టెన్ ధోనీ వేగంగా పరుగెత్తి వచ్చి వికెట్లను పడగొట్టాడు. రీప్లేలో నాన్ స్ట్రైకర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ సమయానికి క్రీజ్ లోకి చేరలేదని తేలడంతో అవుట్ గా ప్రకటించారు. దీంతో భారత్ ఒక్క పరుగుతో విజయం సాధించింది. దశాబ్దం తర్వాత ఆ మ్యాచ్ ను గుర్తు చేసుకున్న మహ్మదుల్లా.. అది చాలా బాధాకరమైన ఓటమి అని వర్ణించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే కాకుండా హోటల్‌కు వెళ్లిన తర్వాత కూడా ఆటగాళ్లు ఏడ్చారని తెలిపారు.
Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!
“ఆ మ్యాచ్‌లో ఏమైందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది చాలా విషాదకరమైన ఘటన. మేము మైదానంలోనే ఏడ్చాం. హోటల్ కు వెళ్లిన తర్వాత కూడా ఏడ్చాం. నేను, ముష్ఫికూర్ రహీమ్ మాత్రమే కాదు.. చాలా మంది ఆటగాళ్లు ఏడ్చారు. భారత్‌ను ఓడించే అవకాశం చాలా దగ్గరగా వచ్చి పోయింది” అని మహ్మదుల్లా ఒక పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు. ఇంకా వ్యక్తిగతంగా కూడా ఆ మ్యాచ్ పెద్ద గుణపాఠం నేర్పిందని మహ్మదుల్లా తెలిపారు. చివరి సమయంలో బౌండరీ కొట్టే ప్రయత్నం చేయడం తాను చేసిన తప్పు అని, స్ట్రైక్ మార్చి ఆడితే ఫలితం వేరుగా ఉండేదని ఆయన తన భావాన్ని వ్యక్త పరిచాడు.
“That was tragic. I think it was extremely heartbreaking. We cried on the ground. When we got back to the hotel we cried. Me, Mushfiqur, we all cried. Many other members were crying as well because we’re so close to beating India”
Mahmudullah to Cricbuzzpic.twitter.com/xLp6L7cVRp
— Cricketopia (@CricketopiaCom) March 13, 2026
తాజావార్తలు
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!