Mahila Shakti – Canteen Service : మహిళలకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ ఆదేశాలననుసరించి రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీస్ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్ లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్ లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
ఇప్పటికే, “అన్న” క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్ అనే పేరుతొ బెంగాల్ లో నడుస్తున్న క్యాంటీన్ ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్యాంటీన్ ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు అన్నారు. ఈ క్యాంటీన్ ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ ను సి.ఎస్ ఆదేశించారు.
Also Read
- Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
- Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
- Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
- How to Use Leftover Milk: మిగిలిపోయిన పాలను పారేయొద్దు.. ఈ 6 చిట్కాలతో డబ్బు ఆదా, రుచి రెట్టింపు!
తాజావార్తలు
-
Sanju Samson-Gambhir: సంజు అసంతృప్తి.. గంభీర్ సర్దిచెప్పే ప్రయత్నం.. సోషల్ మీడియాలో రచ్చ!
-
Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
-
Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
-
Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
-
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!