టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించి.. రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెడ్‌తో జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈ చిత్రం కోసం మహేష్ బాగా కష్టపడుతున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. బాబు లుక్‌కి సంబందించిన వీడియోస్, ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో లుక్ నెట్టింట వైరల్ అయింది. టీషర్ట్ ధరించి, క్యాప్, బ్లాక్ కళ్లద్దాలు, గడ్డం, లాంగ్ హెయిర్‌తో స్మార్ట్ లుక్‌లో మహేష్ కనిపిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ ధరించిన ‘గివెన్చీ’ టీషర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ టీషర్ట్ ధర దాదాపుగా 60,000 రూపాయలు. దీంతో ఈ సింపుల్ టీషర్ట్ రేట్ చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. మహేష్ ఇటీవలి కాలంలో ఎక్కువగా గివెన్చీ టీషర్ట్ వేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Committee Kurrollu: త్వరలోనే ‘కమిటీ కుర్రోళ్లు’ చూస్తా: మహేష్ బాబు
మహేష్ బాబు ఫ్యాషన్, స్టైలీష్ లుక్స్ చూస్తే ఎవరికైనా మెంటల్ ఎక్కిపోవాల్సిందే. ఈవెంట్స్ అయినా, పార్టీస్ అయినా ఎక్కువగా ఫార్మల్ షర్ట్స్, టీషర్ట్ వేసుకుంటుంటారు. ప్రస్తుతం మహేష్ వయసు 48 సంవత్సరాలు. ఇప్పటికీ ఛార్మింగ్, స్టైలీష్ లుక్స్‌తో పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటారు. ఇటీవల అంబానీ పెళ్లిలో మహేష్ లుక్స్ చూసి అందరూ ఫిదా అయ్యారు.