Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఓ వైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తన సత్తా చాటుతున్నాడు. వాటిలో తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బిగ్‌సీ కూడా ఒకటి. బిగ్‌సీ 20వ వార్సికోత్సవ సంబురాల్లో మహేశ్ పాల్గొన్నాడు. ఈవెంట్‌లో భాగంగా మహేష్ బాబు మీడియాతో కాసేపు ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రోజూ మీరు ఎంత సేపు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తారని మహేశ్‌బాబును ఓ రిపోర్టర్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. దీనికి మహేశ్ బాబు స్పందిస్తూ.. అందరిలాగే తాను చాలా సార్లు వాడతానంటూ రిప్లై ఇచ్చాడు. మీ అందరిలాగే నేను కూడా గంటల తరబడి ఫోన్ ఉపయోగిస్తాను.
Read Also:Asara Pensions: గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. త్వరలో రూ. 1000 పెరగనున్న ఆసరా పెన్షన్లు..?
ఒక్కోసారి తలనొప్పి కూడా వస్తుందన్నారు. దీంతో ఫోన్ పక్కన పెట్టేస్తాను అన్నాడు మహేష్ బాబు. ఈ క్రమంలోనే మరో రిపోర్టర్ మీ ఫోన్ రింగ్ టోన్ ఏంటి..? అని ప్రశ్నించగా.. మహేష్ సైలెంట్ అని సమాధానమిచ్చాడు. మరో రిపోర్టర్ మాట్లాడుతూ.. మీరు నిద్రపోయే ముందు, లేచిన తర్వాత మీ మొబైల్‌ను చూసే అలవాటు ఉందా..? అని అడిగాడు. దీనికి మహేశ్ బాబు రిప్లై ఇస్తూ.. అందరూ అలాగే చేస్తున్నారని.. తాను వీలైనంతవరకు ఫోన్‌ను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. స్మార్ట్ ఫోన్ గురించి మహేశ్ బాబు రియాక్షన్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.
The enchanting smile that never fails to melt us and one that we always love to see… @UrstrulyMahesh ❤️❤️❤️#2DecadesOfBigC #SSMB #MaheshBabu @BigCMobilesIND pic.twitter.com/CPuN0vqgmz
— Mahesh Babu Space (@SSMBSpace) August 20, 2023
Read Also:Attack on MLA: మద్యం మత్తులో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్