Site icon NTV Telugu

Mahesh Babu: బాబు కాల్ షీట్స్ కోసం నిర్మాతల క్యూ.. వారణాసి తర్వాత లక్కీ ఛాన్స్‌ ఎవరికంటే!

Mahesh Babu Rajamouli Movie Varanasi

Mahesh Babu Rajamouli Movie Varanasi

Mahesh Babu: ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన టాలీవుడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచ గుర్తింపును తీసుకొచ్చాడు జక్కన్న. ఫర్ ది ఫస్ట్ టైం.. ఆయన దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రం థియేటర్స్‌లోకి రాకముందే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. జక్కన్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో, హాలీవుడ్‌ అడ్వెంచరస్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

READ ALSO: IND vs PAK: భారత్ ముందు ఎవడైనా తల వంచాల్సిందే? కెప్టెన్ సూర్యకు సలాం కొట్టిన ఉస్మాన్ తారిఖ్..

ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత మహేష్‌ బాబు చేయబోయే చిత్రాలపై ప్రేక్షకుల్లో, బాబు అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. వారణాసి క్రేజ్‌తో బాబుతో ఒక్క సినిమా చేయాలని ఎన్నో ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ బాబు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోలేదని సమాచారం. అయితే వారణాసి మూవీ తర్వాత సూపర్ స్టార్‌తో సినిమా చేయడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తోందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మహేష్‌ బాబు, నిర్మాత నవీన్ యెర్నేని కలిసి వారి కాంబినేషన్‌లో చేయబోయే సినిమాకు దర్శకులు, కథాంశాల గురించి చర్చలు జరిపినట్లు టాక్ కూడా నడుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు బాబుతో సినిమాలు చేయడానికి మరికొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం. ఇందులో ‘కేజీఎఫ్’, సలార్ వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వాళ్లు, సన్ పిక్చర్స్ వాళ్లు కూడా మహేష్ బాబు కాల్ షీట్స్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. వారణాసి మూవీ తర్వాత సూపర్ స్టార్‌తో మూవీని లైన్‌లో పెట్టడానికి బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు కూడా క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ మహేష్ బాబు తన సినిమాను ఎవరితో చేసేందుకు రెడీ అవుతాడో వేచి చూడాల్సిందే.

READ ALSO: Rohit Sharma: హ్యాండ్ వివాదంలో హిట్‌మ్యాన్.. పాక్ మాజీ కెప్టెన్‌ను హత్తుకున్న రోహిత్ శర్మ! వీడియో చూశారా..

Exit mobile version