Khaleja Re Release: అరె ఏంట్రా ఇది.. సినిమా హాలులోకి పామును పట్టుకొచ్చిన మహేష్ అభిమాని..!
- ‘ఖలేజా’ రీ-రిలీజ్..
- విజయవాడలో ఓ థియేటర్‌లో భయానకర సంఘటన
- థియేటర్‌కు ఓ అభిమాని నిజమైన పాముతో వచ్చిన అభిమాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khaleja Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ రీ-రిలీజ్ సందర్భంగా విజయవాడలో ఓ థియేటర్‌లో భయానకర సంఘటన చోటుచేసుకుంది. ఈ రిలీజ్ సందర్బంగా అభిమానుల ఉత్సాహం అందరినీ అలరించినప్పటికీ, ఓ అభిమాని చేసిన అనూహ్య చర్య మాత్రం థియేటర్ లో కలకలం సృష్టించింది. ‘ఖలేజా’లో మహేష్ బాబు ఎంట్రీ సీన్ ఓ పాముతో నడిచే గెటప్‌లో ఉండగా, అదే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయాలని విజయవాడలోని బెజవాడ థియేటర్‌కు ఓ అభిమాని నిజమైన పాముతో వచ్చాడు. మొదట అది రబ్బర్ పామని భావించిన అభిమానులు, పాము కదులుతూ ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఘటనపై సమాచారం అందుకున్న థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి, ఆ వ్యక్తిని థియేటర్ బయటకు పంపించారు. ఆ తరువాత జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. థియేటర్‌లో ఉన్నవారు కొంత సమయం భయభ్రాంతులకు గురైనట్లు సమాచారం. ఇకపోతే ఈ మధ్య పాత హిట్ సినిమాల రీ-రిలీజ్‌కు మంచి స్పందన లభిస్తోంది. అదే కోవలో మహేష్ బాబు అభిమానులు భారీ స్థాయిలో ‘ఖలేజా’ మూవీని థియేటర్లలో చూడటానికి తరలివచ్చారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మహేష్ బాబు మ్యాజిక్‌ను ఆస్వాదించేందుకు అభిమానులు భారీగా పాల్గొనడంతో పలు థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో థియేటర్లలో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. అభిమానులు తమ హీరోలను అభిమానించడం మంచిదే కానీ, ఇలాంటి ఘటనలే ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి.
Read Also: PBKS vs RCB: ఇది మర్చిపోలేని రోజు.. అదే మా ఓటమిని శాసించింది: శ్రేయాస్
#Khaleja4KReRelease
విజయవాడ సినిమా హాల్ లో పాము కలకలం..#Khaleja4K రీరిలీజ్ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహం..#MaheshBabu ఎంట్రీ సీన్ లో పాముతో నడిచివచ్చే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయడం కోసం నిజమైన పాముతో ధియేటర్లోకి వచ్చిన అభిమాని..
మొదట రబ్బర్ పాము అనుకున్న మిగిలిన ఫ్యాన్స్..… pic.twitter.com/Lwk9i5IFFY— The Cult Cinema (@cultcinemafeed) May 30, 2025
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..