టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్. వీరిద్దరి బంధం కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, ఒకరికొకరు గొప్ప స్నేహితులు.. సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాలి. నేడు నమ్రత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తన భార్యకు ఎంతో ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆయన రాసిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘హ్యాపీ బర్త్ డే NSG.. మన కుటుంబాన్ని ఇంతటి ప్రేమతో, గౌరవంతో ఒక్కటిగా ఉంచుతున్నందుకు నీకు ధన్యవాదాలు. అంతకంటే నేనేమీ కోరుకోలేను’ అంటూ మహేష్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. తన జీవితంలో నమ్రత పోషించే పాత్ర ఎంత కీలకమో ఈ ఒక్క పోస్ట్‌తో ఆయన మరోసారి నిరూపించారు.
Also Read : S Janaki : సింగర్ ఎస్.జానకి ఇంట్లో తీవ్ర విషాదం..
మహేష్ బాబు సినిమాల పరంగా నిరంతరం బిజీగా ఉన్నప్పటికీ, ఇంటి బాధ్యతల గురించి ఏ రోజూ ఆలోచించాల్సిన అవసరం రాకుండా నమ్రత అన్నీ దగ్గరుండి చూసుకుంటుంటారు. అటు ఫ్యామిలీ వ్యవహారాలు, ఇటు మహేష్ బాబు బిజినెస్ డీల్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ వంటి వాటన్నింటినీ ఆమె ఒక పర్ఫెక్ట్ మేనేజర్‌లా నిర్వహిస్తుంటారు. మహేష్ కెరీర్‌లో ఆమె ఒక ‘స్ట్రాంగ్ పిల్లర్’ లాంటి వారని అభిమానులు కూడా నమ్ముతారు. కేవలం మహేష్ మాత్రమే కాదు, పిల్లలు గౌతమ్ సితార కూడా తమ అమ్మకు స్పెషల్ విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (SSMB 29) పనుల్లో మహేష్ బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.