MS Dhoni: అత్త చేతిలో ఎంఎస్ ధోని వ్యాపారం..! వందల కోట్ల విలువైన సంస్థకు ఆమె సీఈవో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి తెలియనివారుండరు.. భారత జట్టును విజయపథంలో నడిపి.. క్లిష్ట సమయంలోనూ జట్టుకు విజయాలను అందించి మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నారు.. అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పినా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంకా సత్తా చాటుతూనే ఉన్నారు.. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐదోసారి చాంపియన్‌గా నిలిపి.. అసలు ధోనీ లేకుండా ఐపీఎల్ లేదా? అనేలా అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఓవైపు క్రికెట్ మరోవైపు వ్యాపారం.. కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్.. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు జార్ఖండ్ డైనమైట్.. అయితే, మన మహేంద్రుడి వ్యాపార సామ్రాజ్యం మొత్తం తనకు పిల్లను ఇచ్చిన అత్త చేతిలో పెట్టారట ధోనీ..
విషయం ఏంటంటే.. ఓవైపు సంపాదిస్తూనే మరోవైపు.. పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టారు ధోనీ.. వినోద రంగంలోనూ ఎంట్రీ ఇచ్చారు.. ధోనీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. అయితే, ఆ సంస్థ బాధ్యతలు మొత్తం తనకు పిల్లనిచ్చిన అత్త చేతిలో పెట్టారు.. ఆ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మిస్టర్ కూల్ యొక్క అత్త షీలా సింగ్ అట! ఓ నివేదిక ప్రకారం.. తన ప్రొడక్షన్ హౌజ్‌లో కుటుంబ సభ్యులకు పెద్దపీట వేయాలని భావించిన ధోనీ.. భార్య సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్‌కు బాధ్యతలు అప్పగించాడు. కాగా, సౌత్‌లో తన బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మిస్తున్న ధోనీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి అతిపెద్ద షేర్ హోల్డర్ అని సమాచారం.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
అయితే, సాక్షి తండ్రి ఆర్కే సింగ్, ధోనీ తండ్రి పాన్ సింగ్ గతంలో ఒకే స్థలంలో కలిసి పనిచేశారు. బినాగురి అనే టీ కంపెనీలో వీరు సహచరులుగా ఉన్నట్లు తెలుస్తోంది.. అప్పట్లో గృహిణిగా ఉన్న షీలా సింగ్.. అల్లుడు ధోనీ కోరిక మేరకు కూతురితో కలిసి వ్యాపారవేత్తగా మారినట్లు ఆ నివేదిక చెబుతోంది.. ఇక, చాలా నివేదికల్లో మిస్టర్ కూల్ ధోని నికర ఆస్తుల విలువ దాదాపు 1030 కోట్లుగా అంచనా వేస్తున్నారు.. కాగా, ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్న ధోనీ ఇప్పటి వరకు ఐదుసార్లు ట్రోఫీని జట్టుకు అందించాడు. టీమిండియా బెస్ట్ ఫినిషర్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ.. తన కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4,876 పరుగులు, వన్డేల్లో 10,773 పరుగులు, టీ20ల్లో 1,617 పరుగులు చేశాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ వస్తున్న విషయం విదితమే. పెళ్లి అయిన తర్వాత ఏ భర్త అయినా.. భార్య మాట వింటాడని.. ఆమె చెప్పినట్టే నడుచుకుంటారని అంటారు.. అత్తలు కూడా కూతురు, అల్లుడిపై ఎక్కువ మమకారం చూపుతారని చెబుతుంటారు.. మన ధోనీ మాత్రం.. ఏకంగా వందల కోట్ల విలువైన సంస్థను అత్తగారి చేతిలో పెట్టేశాడు మరి.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!