Mahela Jayawardene: 13 ఏళ్ల నిరీక్షణకు తెర.. జయవర్దనేకు బంపర్ ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2027 మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేను తమ WPL జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. జట్టు వ్యూహాలు, కొత్త ప్రతిభను గుర్తించడం, ఆటగాళ్లు , కోచింగ్ సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి అన్ని క్రికెట్ వ్యవహారాలను జయవర్ధనే పర్యవేక్షించనున్నారు.
ఈ నియామకంతో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జయవర్ధనే తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరారు. గతంలో 2012, 2013 ఐపీఎల్ సీజన్లలో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన ఆయన, 2013లో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఇటీవలే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న జయవర్ధనే, ఆ జట్టుకు 2017, 2019, 2020లలో మూడు టైటిళ్లను అందించిన ఘనత కలిగి ఉన్నారు.
Also Read
- Rahul Gandhi: ప్రపంచ రాజకీయాల్లో భారత్ ‘‘సైడ్ ప్లేయర్’’.. రాహుల్ ‘‘పాక్ ఫ్యాన్ బాయ్’’ అంటూ బీజేపీ విమర్శలు..
- India vs New Zealand: 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్లు..
- APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
- Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
ఢిల్లీ క్యాపిటల్స్ WPL జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల జయవర్ధనే సంతోషం వ్యక్తం చేశారు. మహిళల క్రికెట్ భవిష్యత్తుపై ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్పష్టమైన విజన్ ఉందని, ప్రతిభావంతులైన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన సహాయక సిబ్బందితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. జట్టు బలాలను మరింత మెరుగుపరుస్తూ, ప్రదర్శనలో నిలకడ తీసుకువచ్చి టైటిల్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫ్రాంచైజీ సహ-యజమానులు కిరణ్ కుమార్ గ్రంధి, పార్థ్ జిందాల్ కూడా జయవర్ధనే రాకను స్వాగతించారు.
ఆధునిక క్రికెట్‌పై ఆయనకున్న అవగాహన, జట్టును నిర్మించే అనుభవం ఢిల్లీ క్యాపిటల్స్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతల్లో జయవర్ధనే, ప్రధాన కోచ్ జోనాథన్ బాటీ మరియు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి పనిచేయనున్నారు. ఇప్పటివరకు నాలుగు సార్లు WPL ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, జయవర్ధనే మార్గదర్శకత్వంలో తమ తొలి ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి 14, 2027న WPL ఐదో ఎడిషన్ ప్రారంభం కానుండగా, జనవరి 16న వడోదరలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
తాజావార్తలు
-
Mahela Jayawardene: 13 ఏళ్ల నిరీక్షణకు తెర.. జయవర్దనేకు బంపర్ ఆఫర్..
-
Rahul Gandhi: ప్రపంచ రాజకీయాల్లో భారత్ ‘‘సైడ్ ప్లేయర్’’.. రాహుల్ ‘‘పాక్ ఫ్యాన్ బాయ్’’ అంటూ బీజేపీ విమర్శలు..
-
India vs New Zealand: 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్లు..
-
APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
-
KL Rahul History: తొలి భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర.. దిగ్గజాల వల్లే కాలేదు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!