Farmer Suicide: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్షి తాలూకాలోని దహితానే (వైరాగ్) గ్రామంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అధిక వర్షపాతం, పెరుగుతున్న విద్యా ఖర్చులతో బాధపడుతూ ఒక రైతు మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 40 ఏళ్ల లక్ష్మణ్ కాశీనాథ్ గవాసానేగా గుర్తించారు.
READ MORE: R.S. Brothers : 15వ షోరూమ్ హైదరాబాద్ వనస్థలిపురంలో శుభారంభం
బుధవారం ఉదయం 7:30 గంటలకు ససురా శివార్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం లక్ష్మణ్ ఇంటి నుంచి వైరాయ్ మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. కానీ తిరిగి రాలేదు. ఆ రాత్రి రోజు రాత్రి వైరాగ్ పోలీస్ స్టేషన్‌లో అతని కుటుంబం ఆయన తప్పిపోయినట్లు ఫిర్యాదు అందించింది. బుధవారం ఉదయం.. గ్రామ సమీపంలోని మామిడి చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌సింగ్ జాదవ్, సబ్-ఇన్‌స్పెక్టర్ శివాజీ హేల్, కానిస్టేబుల్ ప్రదీప్ చవాన్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.
READ MORE: KTR : 400 కి.మీ మెట్రో విస్తరణకు మేము పచ్చ జెండా ఊపాము.. హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం!
అయితే.. మృతుడి జేబులో ఒక లేఖ దొరికింది. “ఎమ్మెల్యేలు, ఎంపీలు దయచేసి ఆర్థిక సహాయం అందించండి. నా పిల్లలు జ్ఞానేశ్వర్, జ్ఞానేశ్వరిల విద్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.” అని రాశారు. ఈ లేఖ కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కదిలించింది. అయితే.. లక్ష్మణ్ గవాసానే కుమార్తె బి.ఎస్సీ డిగ్రీ చదువుతోంది. కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇద్దరికీ విద్యా ఖర్చులు క్రమంగా పెరుగడం కూడా ఆయన ఆత్మహత్యకు ఓ కారణం అని చెబుతున్నారు. మరోవైపు, ఆ రైతుకు ఒకటిన్నర ఎకరాల భూమి ఉంది. గత వారం రోజులుగా నిరంతరాయంగా కురిసిన వర్షాలకు పంట పొలంలోకి భారీగా నీరు చేరాయి. పంట కుళ్ళిపోయింది. ఫలితంగా గణనీయమైన నష్టాలు సంభవించాయి. పంట వైఫల్యం, అనారోగ్యం, పెరుగుతున్న ఖర్చులతో నిరాశ చెందిన లక్ష్మణ్ ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు.