NTV Telugu Site icon

Cabinet Expansion: నేడు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. వీరికే మంత్రి పదవులు..!

Cabinet Expansion Maharasht

Cabinet Expansion Maharasht

నేడు మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. రాజ్‌భవన్‌లోని ప్రాంగంణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాకూటమి ప్రభుత్వంలో బీజేపీకి చెందిన 21 మంది, శివసేనకు చెందిన 12 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి చెందిన 10 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కాగా.. బీజేపీ, శివసేన (షిండే వర్గం), అజిత్‌ పవార్‌కు చెందిన ఎన్‌సీపీల నుంచి మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే అవకాశం ఉందో ఈ జాబితాలో తెలుసుకుందాం.

Yogi Adityanath: తాజ్‌మహాల్ కట్టిన కూలీల చేతులు నరికేశారు.. రామమందిరం కట్టిన వారికి గౌరవం

బీజేపీకి అవకాశం ఉన్న మంత్రుల జాబితా
1) మంగళ్‌ప్రభాత్ లోధా, ముంబై
2) ఆశిష్ షెలార్, ముంబై
3) అతుల్ భత్ఖల్కర్, ముంబై
4) రవీంద్ర చవాన్, కొంకణ్
5) నితేష్ రాణే, కొంకణ్
6) శివేంద్రసింహరాజే భోసలే, పశ్చిమ మహారాష్ట్ర
7) గోపీచంద్ పదాల్కర్, పశ్చిమ మహారాష్ట్ర
8) మాధురి మిసల్, పశ్చిమ మహారాష్ట్ర
9) రాధాకృష్ణ విఖే పాటిల్, పశ్చిమ మహారాష్ట్ర
10) చంద్రశేఖర్ బవాన్కులే, విదర్భ
11) సంజయ్ కుటే, విదర్భ
12) గిరీష్ మహాజన్, ఉత్తర మహారాష్ట్ర
13) జైకుమార్ రావల్, ఉత్తర మహారాష్ట్ర
14) పంకజా ముండే, మరాఠ్వాడా
15) అతుల్ సవే, మరాఠ్వాడా

శివసేన నుంచి మంత్రి పదవి దక్కే అవకాశం
1) ఉదయ్ సమంత్, కొంకణ్
2) శంభురాజే దేశాయ్, పశ్చిమ మహారాష్ట్ర
3) గులాబ్రావ్ పాటిల్, ఉత్తర మహారాష్ట్ర
4) దాదా భూసే, ఉత్తర మహారాష్ట్ర
5) సంజయ్ రాథోడ్, విదర్భ
6) సంజయ్ శిర్సత్, మరాఠ్వాడా
7) భరత్‌శేత్ గోగావాలే, రాయగడ
8) ప్రకాష్ అబిత్కర్, పశ్చిమ మహారాష్ట్ర
9) యోగేష్ కదమ్, కొంకణ్
10) ఆశిష్ జైస్వాల్, విదర్భ
11) ప్రతాప్ సర్నాయక్, థానే

ఎన్సీపీ నుంచి
1) ఛగన్ భుజబల్
2) అదితి తత్కరే
3) అనిల్ పాటిల్
4) సంజయ్ బన్సోడే
5) అజిత్ పవార్
6) మకరంద్ పాటిల్
7) నరహరి జిర్వాల్
8) ధనంజయ్ ముండే
9) సనా మాలిక్
10) ఇంద్రనీల్ నాయక్

మహాయుతి ప్రభుత్వ కేబినెట్‌లో బీజేపీ నుంచి 21 మంది, శివసేన నుంచి 12 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది మంత్రులు ఉంటారు. వీరిలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో నేడు బీజేపీకి చెందిన 20 మంది, శివసేనకు చెందిన 11 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఇందుకోసం రాజ్‌భవన్‌లోని లాన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 1991లో శివసేన విడిపోయిన తర్వాత నాగ్‌పూర్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. 33 ఏళ్ల తర్వాత నాగ్‌పూర్‌లో ఈరోజు మళ్లీ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

Show comments