నేడు మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. రాజ్‌భవన్‌లోని ప్రాంగంణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఆదివారం (డిసెంబర్ 15)న నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ప్రమాణ స్వీకారోత్సవంతో తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. దాదాపు 30 మంది కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలకు ముందే విస్తరణ జరగనుంది.
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర బీజేపీ- శివసేన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ మంత్రి వర్గ కూర్పు ఖారైంది. ఇరు పక్షాలు చెరో 9 మంత్రి పదవులను పంచుకున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా 18 మందిని మంత్రి పదవులు వరించనున్నాయి. రెండు భాగస్వామ్య పార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ఇరు పక్షాలు చెరి సమానంగా మంత్రి పదవులు తీసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ, శివసేన పార్టీ నుంచి…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 14 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.