Maharaja : వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం “మహారాజా”. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. కాగా ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకోమని కోరగా ఆయన అంగీకరించి ఫ్రీగా ఈ చిత్రంలో నటించారని సమాచారం. విడుదల నాటి నుండి సూపర్ హిట్ తో దూసుకు వెళ్లింది ఈ సినిమా. జూన్ 14న విడుదలైన ఈ సినిమా 50 రోజులు విజయవంతంగా ఆడింది. ఇటు తెలుగులోను మహారాజా సూపర్ హిట్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మహారాజా 20కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
Read Also:HMPV Virus: HMPV వైరస్ భయం వద్దు.. చేయాల్సినవి, చేయకూడని పనులు ఇవే..
ఈ క్రమంలోనే ఇటీవల చైనాలో రిలీజ్ అయింది. పొరుగు దేశంలో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసి చైనీయులు కన్నీరు మున్నీరవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చైనా బాక్సాఫీస్ దగ్గర లేటెస్టుగా మరో అరుదైన ఫీట్ సాధించింది. ‘మహారాజ’ మూవీ చైనాలో ఇప్పటి వరకూ రూ. 91.55 కోట్ల వసూళ్లను రాబట్టి, 100 కోట్లకు చేరువవుతోంది. తద్వారా గడిచిన ఐదేళ్ళలో చైనా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ వేదికగా ప్రకటించారు. ఇక తూర్పు లడఖ్ లో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన సమసిపోయిన తర్వాత చైనాలో రిలీజైన మొదటి భారతీయ చిత్రం ఇదే.
Read Also:Hyderabad: ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
చైనాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్-10 సినిమాల లిస్టులో చేరిన ఒకే ఒక్క సౌత్ మూవీగా రికార్డులకు ఎక్కింది. మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా రూ.1480 కోట్ల వసూళ్లతో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా కాగా ఇప్పుడు ‘మహారాజా’ సుమారు 92 కోట్ల వసూళ్లతో పదో స్థానంలో నిలిచింది. ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా చైనాలో రూ. 80 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ‘మహారాజా’ సినిమా దాన్ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహారాజ విజయ్ సేతుపతి కెరీర్ లో మైలురాయి 50వ చిత్రం.