Vemulawada Temple: రాజన్న మోస్ట్ పవర్ ఫుల్.. దేశ ప్రజలు వేములవాడకి వెళ్లాలనుకుంటున్నారు: బండి సంజయ్
- వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు
- రాజన్న ఆలయాన్ని సందర్శించిన బండి సంజయ్
- రాజన్న మోస్ట్ పవర్ ఫుల్ అన్న బండి
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోడె మొక్కులు సమర్పించుకుని.. రాజన్న దర్శనం చేసుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు.
రాజన్న దర్శనం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మహా శివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శనం చేసుకున్నా. దక్షిణ కాశీగా పిలువబడే రాజన్న ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్. దేశ ప్రధాని వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. ప్రధాని దర్శనం నుండి దేశ ప్రజలు కూడా వేములవాడకి వెళ్లానుకుంటున్నారు. మహా శివరాత్రి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈఓ, సిబ్బంది, సేవ సంస్థలను అభినందిస్తున్నాను. ఇదే స్పూర్తితో చివరివరకు భక్తులకు సౌకర్యాలు కొనసాగించాలి’ అని సూచించారు.
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు ప్రధాన ఆలయంలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. దాంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అర్ధరాత్రి నుంచే క్యూలో 6 గంటల పాటు వేచి ఉన్నప్పటికీ దర్శనం కాలేదని, ప్రధాన ఆలయంలోకి అనుమతించలేదని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న దర్శనం కాకుండానే శిఖర దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. వీఐపీలు, అధికారులు అధిక సంఖ్యలో బంధువులకు నేరుగా దర్శనం చేయిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!